
రైతులు అధైర్యపడొద్దు
కొమురవెల్లి(సిద్దిపేట): ‘తపాస్‌పల్లి రిజర్వాయర్ కింద వరి పంట వేసిన రైతులు అధైర్యపడొద్దు. పది రోజుల్లో రిజర్వాయర్‌కు నీటి పంపింగ్ చేస్తా’మని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. బుధవారం స్థానిక రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలసి తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను సందర్శించారు. ఈసందర్భంగా రిజర్వాయర్ లోకి నీళ్లు వచ్చేలా తక్షణం చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.అనంతరం ఏర్పాటు చేసిన విలేకరులతో ఎంపీ మాట్లాడారు. పంటలు ఎండి పోకుండా పొలాలకు నీరు అందిస్తామని హామీ చెప్పారు. పొలాలకు నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే రిజర్వాయర్‌ను సందర్శించినట్లు తెలిపారు. తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు నీళ్లు రావాలంటే ముందున్న ధర్మసాగర్, బొమ్మకూరు రిజర్వాయర్‌లలో నీటి లభ్యత తక్కువగా ఉందన్నారు. ముందు వాటిని నింపిన తర్వాతే తపాస్‌పల్లికి నీరు వస్తుందని తెలిపారు. వెంటనే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో మాట్లాడి త్వరగా నీళ్లు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మద్దూరు మాజీ జెడ్పీటీసీ గిరి కొండల్ రెడ్డి, చేర్యాల మాజీ జెడ్పీటీసీ కొమ్ము నర్సింగరావు, నాగపురి కిరణ్‌కుమార్, కొమురవెల్లి మల్లన్న ఆలయ ధర్మకర్తలు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తపాస్‌పల్లికి పదిరోజుల్లో నీళ్లు
రిజర్వాయర్ నింపాలని
అధికారులను ఆదేశించాం
భువనగిరి ఎంపీ
చామల కిరణ్ కుమార్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment