వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి
ములుగు(గజ్వేల్): ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ములుగు అటవీ కళాశాల, పరిశోధన కేంద్రం ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్, కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎన్.ఎస్ శ్రీనిధి సూచించారు. ములుగు మండలం అచ్చాయిపల్లిలో వారంరోజుల పాటు కొనసాగనున్న ఎన్‌ఎస్‌ఎస్ శిబిరంలో భాగంగా శుక్రవారం విద్యార్థులచే గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్లాస్టిక్ నియంత్రణ, స్వచ్ఛభారత్, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అనంతరం లయన్స్‌క్లబ్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటుచేసి గ్రామస్తులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని రక్షించడంలో ప్రతి ఒక్కరూ పాత్రధారులు కావాలన్నారు. ప్లాస్టిక్ రహిత వస్తువులను వినియోగించాలన్నారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో యువకులు స్వచ్ఛందంగా పాల్గొని పరిసరాలు శుభ్రం చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.
ములుగు అటవీకళాశాల అసిస్టెంట్
ప్రొఫెసర్ శ్రీనిధి
Comments
Please login to add a commentAdd a comment