
పల్లెల్లోకి కరువును తీసుకొచ్చిన కాంగ్రెస్
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
దుబ్బాకటౌన్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తెలంగాణ పల్లెల్లోకి కరువును తీసుకొచ్చిందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. రాయపోల్ మండల కేంద్రంలో శనివారం బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. 27న వరంగల్‌లో జరిగే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసుగు చెందారని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. 27న జరిగే సభకు ప్రజలు చీమల దండులా తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ప్రజాపాలన కాదు.. కక్షసాధింపు పాలన
కొండపాక(గజ్వేల్): రాష్ట్రంలో ప్రజాపాలన కాదు.. కక్షసాధింపు పాలన కొనసాగుతుందంటూ ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కుకునూరుపల్లి, దుద్దెడలోని ప్రైవేటు పంక్షన్ హాళ్లలో బీఆర్‌ఎస్ రజతోత్సవ బహిరంగసభ నిర్వహణ కోసం శనివారం ముఖ్య కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన స్వర్ణయుగంలా ప్రజలు కొలుస్తున్నారన్నారు. ఇటీవల కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో నిర్వహించినది రాజ్యాంగ పరిరక్షణ పోరుయాత్ర కాదని ముఖ్య నేతల పదవులను కాపాడుకునేందుకు నిర్వహించిన పోరుబాట అన్నారు. ఆచరణకు సాధ్యం కాని హామీలనిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభు త్వం ప్రాజెక్టుల నుంచి చెరువులకు నీరు విడుదల చేయకుండా లక్షల ఎకరాల్లో పంటలు ఎండగొట్టి రైతులను ఆగం చేసిందని వాపోయారు. ఎల్కతుర్తిలో నిర్వహించే భారీ బహిరంగసభకు అధిక సంఖ్యలో ప్రజలను తరలించాలని కోరారు. అనంతరం బహిరంగసభ పోస్టర్‌లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్‌రెడ్డి, రవీందదర్, అమరేందర్, దుర్గయ్య, కుమార్, శ్రీనివాస్, కనకయ్య, భగవాన్, శ్రీనివాస్, కిరణ్‌కుమార్‌చారి, శ్రీనివాస్, ఐలయ్య, ఎల్లం, లక్ష్మణ్‌రాజ్, హైమద్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.