
వైభవం.. బొడ్రాయి వార్షికోత్సవం
మద్దూరు(హుస్నాబాద్): మండలంలోని లద్నూరులో బొడ్రాయి ప్రథమ వార్షికోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా దూసకంటి రాజేశ్‌శర్మ, నవీన్‌శర్మ, వంశీకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు తమ ఇండ్ల వద్ద నుంచి బిందెలతో నీళ్లు తీసుకువచ్చి బొడ్రాయికి జలాభిషేకం చేశారు. అనంతరం డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాల మధ్య మహిళలు బోనాలతో తరలివెళ్లి బొడ్రాయి, పోచమ్మలకు నైవేద్యంగా సమర్పించారు. బొడ్రాయి ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.