
ఉగ్రదాడికి నిరసనగా శాంతి ర్యాలీ
కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిపై జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. బుధవారం రాత్రి గజ్వేల్ పట్టణంలో పార్టీల కతీతంగా కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన వీధులగుండా జాతీయ జెండాలను పట్టుకొని ర్యాలీ చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఉగ్రవాదుల దుశ్చర్యను తీవ్ర స్థాయిలో ఖండించారు. కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, యువజన, ప్రజా సంఘాల నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
– గజ్వేల్‌రూరల్