‘మాట్లాడటానికి ఓ కుటుంబం కావాలి’ | 9 Year Old Boy Emotional Adoption Appeal Gets 5000 Responses | Sakshi
Sakshi News home page

తొమ్మిదేళ్ల కుర్రాడి కోసం 5వేల మంది క్యూ

Aug 18 2020 1:38 PM | Updated on Aug 18 2020 3:07 PM

9 Year Old Boy Emotional Adoption Appeal Gets 5000 Responses - Sakshi

అనాథలుగా బతకడం ఎంత కష్టమో చెప్పడానికి మాటలు చాలవు. స్వయంగా అనుభవిస్తే తప్ప ఆ బాధ ఎవరికి అర్థం కాదు. తల్లీతండ్రి ప్రేమకు నోచుకోకుండా.. నా అనే వాళ్లు ఎవరూ లేకుండా బతకడం నరకంతో సమానం. ఈ క్రమంలో ఓ తొమ్మిదేళ్ల అనాథ పిల్లాడి వేదన జనాలను కదిలిస్తోంది. అతడిని దత్తత తీసుకుంటామంటూ ఇప్పటికే 5వేల మంది అప్లై చేశారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. వివరాలు.. తొమ్మిదేళ్ల జోర్డాన్‌ తన సోదరుడితో కలిసి గత ఆరేళ్లుగా అనాథాశ్రమంలో ఉంటున్నాడు. కొద్ది రోజుల క్రితం సోదరుడిని ఓ కుటుంబం దత్తత తీసుకుంది. దాంతో మరింత ఒంటరి అయ్యాడు జోర్డాన్‌. ఈ క్రమంలో కేఎఫ్‌ఓఆర్‌ వీక్లీ సిరీస్‌ ‘ఏ ప్లేస్‌ టు కాల్‌ హోమ్‌’ లైవ్‌ షోలో తనకంటూ ఓ కుటుంబం ఉంటే ఎంతో సంతోషిస్తానని.. ఓ శాశ్వత కుటుంబం కోసం తాను ఎంత ఆత్రంగా ఎదురు చూస్తున్నాడో తెలియజేశాడు జోర్డాన్‌. (ఆ ఘటన కలిచివేసింది: దివ్య దేవరాజన్‌)

ఈ షోలో తన మనోవేదనను తెలిపాడు జోర్డాన్‌. ‘నాకంటూ ఓ కుటుంబం ఉంటే బాగుంటుంది. అమ్మ, నాన్న ఇతర కుటుంబ సభ్యులు. ఇవేం కుదరకపోతే కనీసం అమ్మ, నాన్న ఎవరో ఒకరు ఉన్నా చాలు. నేను మాట్లాడటానికి.. నా మనసులోని భావాలను తెలపడానికి నాకు ఓ కుటుంబం కావాలని  బలంగా కోరుకుంటున్నాను. ఈ షో చూస్తున్న వారిలో ఎవరైనా నన్ను దత్తత తీసుకుంటారని ఆశిస్తున్నాను’ అన్నాడు. జోర్డాన్‌ వేదన పలువురిని కదిలించింది. అతడిని దత్తత తీసుకోవడనానికి ఎందరో ఆసక్తి చూపించారు. ఈ క్రమంలో జోర్డాన్‌ ఉంటున్న ఆశ్రమానికి అతడిని దత్తత తీసుకుంటామంటూ దాదాపు 5వేల అప్లికేషన్లు వచ్చాయి. ప్రస్తుతం ఆశ్రమ నిర్వహకులు జోర్డాన్‌ను పంపడానికి తగిన వ్యక్తుల కోసం అప్లికేషన్లను పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వహకుడు మాట్లాడుతూ... ‘గతంలో చాలా మంది జోర్డాన్‌ను దత్తత తీసుకెళ్లారు. కానీ అతడు వారి కుటుంబానికి సూట్‌ కాడని తెలిపి.. తిరిగి ఇక్కడకు తీసుకువచ్చేవారు’ అన్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement