కోహ్లితో డివిలియర్స్ (Photo Credit: IPL/BCCI)
IPL 2023- AB de Villiers- Virat Kohli: సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు లెజెండ్ ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్-2023 టైటిల్‌ను ఆర్సీబీ గెలవాలని తాను కోరుకుంటున్నానని.. అయితే ట్రోఫీ గెలిచే అవకాశాలు మాత్రం డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌కే ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు.
కాగా ఐపీఎల్-2022 సీజన్‌తో క్యాష్ రిచ్ లీగ్‌లో అడుగుపెట్టిన గుజరాత్.. ఎంట్రీలోనే అదరగొట్టింది. వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ చేరి ఫైనల్లో రాజస్తాన్ రాయల్స్‌ను ఓడించి విజేతగా అవతరించింది. ఇక పదహారో ఎడిషన్‌లో సీఎస్‌కేతో ఆరంభ మ్యాచ్‌లో గెలుపొందిన హార్దిక్ సేన.. రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది.
ఆర్సీబీ గెలవాలని ఉన్నా
తాజా సీజన్‌లోనూ వరుసగా రెండు విజయాలు నమోదు చేసి జోరు మీదుంది గుజరాత్. ఈ నేపథ్యంలో ఎన్డీటీవీతో ముచ్చటించిన డివిలియర్స్.. ఈసారి చాంపియన్ ఎవరనుకుంటున్నారన్న ప్రశ్నపై స్పందించాడు. ‘‘విజేతను అంచనా వేయడం కష్టమే. అయితే, ఐపీఎల్ వేలం సమయంలోనే గుజరాత్ టైటాన్స్ గురించి మాట్లాడుతూ.. ఆ జట్టుకు చాంపియన్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పాను.
ఇప్పుడు కూడా ఆ మాటకే కట్టుబడి ఉన్నాను. అయితే, నా మనసులో మాత్రం ఆర్సీబీ ట్రోఫీ గెలవాలని ఉంది. గతేడాది బెంగళూరు అద్బుతంగా ఆడింది. ఈసారి కూడా అదే ఫామ్ కంటిన్యూ చేస్తుందని ఆశిస్తున్నా’’ అని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.
కోహ్లిలో పెద్దగా మార్పులేదు.. తన సక్సెస్ మంత్ర అదే
ఇక ఆర్సీబీ మాజీ సారథి విరాట్ కోహ్లిలో ఏమైనా మార్పులు గమనించారా అని ప్రశ్నించగా.. ‘‘కెప్టెన్సీ భారం నుంచి విముక్తి పొందాక తను చాలా రిలాక్సింగ్‌గా కనిపిస్తున్నాడు. నిజానికి తను అద్భుతమైన నాయకుడు. అంతర్జాతీయ స్థాయిలో.. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా తనదైన ముద్రవేశాడు.
సారథ్య బాధ్యతలతో బిజీగా ఉండటం వల్ల కుటుంబం, స్నేహితులతో కలిసి కాస్త సమయం గడపడమే కష్టమయ్యేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు తను మునుపటి కంటే మరింత సంతోషంగా ఉన్నాడు. తన సక్సెస్ మంత్ర ఇదే అనుకుంటా’’ అని డివిలియర్స్ పేర్కొన్నాడు.
తన ఆట తీరులో పెద్దగా మార్పులు రాలేదని.. అయితే ఇప్పుడు కాస్త రిఫ్రెష్ అయి అద్భుత ఫామ్‌తో మునుపటి కోహ్లిని తలపిస్తున్నాడని చెప్పుకొచ్చాడు. కాగా ముంబై ఇండియన్స్‌తో తమ ఆరంభ మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ కోహ్లి 82 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు.
చదవండి: కెప్టెన్‌గా చతేశ్వర్ పుజారా
బట్లర్‌ను కాదని అందుకే అశూతో ఓపెనింగ్.. గెలిచే మ్యాచ్‌లో ఓడిపోయాం: సంజూ
Comments
Please login to add a commentAdd a comment