'వచ్చామా.. కసితీరా కొట్టామా.. వెళ్లామా; ఇదే నా స్టైల్‌' | Abhishek Sharma-Message Batting Style-After India-Win-T20-Series Vs AFG | Sakshi
Sakshi News home page

Abhishek Sharma: 'వచ్చామా.. కసితీరా కొట్టామా.. వెళ్లామా; ఇదే నా స్టైల్‌'

Sep 17 2026 11:47 PM | Updated on Sep 18 2026 12:21 AM

Abhishek Sharma-Message Batting Style-After India-Win-T20-Series Vs AFG

Photo Credit: BCCI Twitter

అఫ్గానిస్తాన్‌తో జ‌రిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భార‌త ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ 30 బంతుల్లోనే సెంచ‌రీ సాధించి ప‌లు రికార్డులు బ‌ద్ద‌లుకొట్టాడు. భార‌త్ త‌ర‌ఫున అత్యంత వేగ‌వంత‌మైన సెంచ‌రీ రికార్డును అభిషేక్ త‌న పేరిట లిఖించుకున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు ఆ రికార్డు రోహిత్ శ‌ర్మ (35 బంతులు) పేరిట ఉండేది. ఇక మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా 3-0తో ఆఫ్గన్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది.

ఇక మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా 127 ప‌రుగుల భారీ తేడాతో అఫ్గానిస్తాన్‌ను మ‌ట్టిక‌రిపించింది. మ్యాచ్ విజ‌యం అనంత‌రం 'ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌'తో పాటు ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకున్న అభిషేక్ శ‌ర్మ త‌న ప్ర‌ద‌ర్శ‌న‌పై స్పందించాడు. రికార్డులు తనకు ముఖ్యం కాదని, మ్యాచ్‌లో బరిలోకి దిగితే వచ్చామా.. కసితీరా కొట్టామా.. వెళ్లామా అన్నట్లుగా తన బ్యాటింగ్‌ స్టైల్‌ ఉంటుందని అభిషేక్‌ తెలిపాడు.


Photo Credit: BCCI Twitter

"ముందుగా ఇవాళ మ్యాచ్ చూసేందుకు వ‌చ్చిన ప్రేక్ష‌కుల్లో ఎవ‌రిదైనా పుట్టిన‌రోజు ఉంటే వారికి నా ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు. నేను సాధించిన సెంచ‌రీ వారికి గిఫ్ట్ అని భావిస్తున్నా. ఇక‌ రెండు సంవ‌త్స‌రాల క్రితం, మేము ఒక నిర్దిష్ట ప్ర‌ణాళిక‌తో ఆడి అన్ని జ‌ట్ల‌పై ఆధిప‌త్యం చెలాయించాల‌ని నిర్ణ‌యించుకున్న విష‌యం నాకు బాగా గుర్తుంది. ఆ ప్ర‌ణాళిక ఒక సంవ‌త్స‌రం పాటు చ‌క్క‌గానే ప‌నిచేసింది. ఈలోగా రెండు (ఇంగ్లండ్‌, ఐర్లాండ్) సిరీస్‌లు మాకు ప్ర‌తికూల ఫ‌లితాలను ఇచ్చాయి. 

కానీ ఒకటి రెండు చెడ్డ సిరీస్‌లు మా బ్యాటింగ్‌ను నిర్వ‌చించ‌లేవు. ఆడుతుంది చిన్న జ‌ట్టుతోనే, పెద్ద జ‌ట్టుతోనా అనేది ప‌క్క‌న‌బెట్టి జ‌ట్టు విజ‌యం కోసం మేమంతా స‌మిష్టి ప్ర‌ద‌ర్శ‌న చేశాము. ఇక నా విష‌యానికొస్తే ప్ర‌తీ సిరీస్‌కు ముందు నేను అనుస‌రించే ప్ర‌క్రియ‌పైనే ఇదంతా ఆధార‌ప‌డి ఉంటుంద‌ని భావిస్తున్నా. ఎవ‌రితో ఆడుతున్నాను, బౌల‌ర్లు ఎవ‌రు అనే విష‌యాలు నాకు ప్ర‌త్యేకం. కాబ‌ట్టి వ్య‌క్తిగ‌తంగా ఒక బ్యాట‌ర్‌గా నా దృష్టి ఎప్పుడూ బ్యాటింగ్ ప‌వ‌ర్ ప్లేపైనే ఉంటుంది. 


Photo Credit: BCCI Twitter

మైదానంలో దూకుడుగా ఆడాలంటే ముందుగా సరైన ప్రిపరేషన్ అవ‌సరం. అదే నా విజయానికి కారణం. ఆఫ్గ‌న్‌తో టీ20 సిరీస్‌లో బ్యాటింగ్‌కు సంబంధించి పెద్దగా ప్ర‌ణాళిక‌లంటూ ఏమీ లేవు. ఆది నుంచి వారిపై ఆధిపత్యం ప్ర‌ద‌ర్శిస్తే జ‌ట్టుకు భారీ స్కోరు ఇవ్వ‌గ‌ల‌న‌నే అంశాన్ని మాత్ర‌మే మైండ్‌లో పెట్టుకొని ఆడుతూ వ‌చ్చాను. రికార్డుల గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోను. 

జ‌ట్టుకు అవ‌స‌ర‌మైన‌ప్పుడు బాధ్య‌తాయుతంగా ఆడి ప‌ని పూర్తి చేయ‌డంపైనే దృష్టి సారిస్తాను. కెప్టెన్‌, కోచ్ నుంచి మ‌ద్ద‌తు ఉండ‌డం వ‌ల్లే ఇదంతా సాధ్య‌మైంది." అని చెప్పుకొచ్చాడు. ఇక అభిషేక్ శ‌ర్మ అఫ్గానిస్తాన్‌తో మూడు మ్యాచ్‌లు ఆడి 269 స్ట్రైక్‌రేట్‌తో 229 ప‌రుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచ‌రీ, అర్థ‌సెంచ‌రీ ఉన్నాయి.

ఇదీ చదవండి: మూడో టీ20లో టీమిండియా విజయం.. ఆఫ్గన్‌ క్లీన్‌స్వీప్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement