మూడో టీ20లో టీమిండియా విజయం.. ఆఫ్గన్‌ క్లీన్‌స్వీప్‌ | Team India Won-By 127 Runs-Vs AFG 3rd T20 Match-T20 Series Cleansweep | Sakshi
Sakshi News home page

మూడో టీ20లో టీమిండియా విజయం.. ఆఫ్గన్‌ క్లీన్‌స్వీప్‌

Sep 17 2026 10:37 PM | Updated on Sep 18 2026 12:15 AM

Team India Won-By 127 Runs-Vs AFG 3rd T20 Match-T20 Series Cleansweep

Photo Credit: BCCI Twitter

స్వ‌దేశంలో అఫ్గానిస్తాన్‌తో జ‌రిగిన టీ20 సిరీస్‌ను టీమిండియా 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఢిల్లీ వేదిక‌గా గురువారం జ‌రిగిన చివరి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 127 ప‌రుగుల తేడాతో అఫ్గానిస్తాన్‌పై విజ‌యం సాధించింది. 222 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన అఫ్గానిస్తాన్ భారత బౌలర్ల ధాటికి 14.1 ఓవ‌ర్ల‌లో 94 ప‌రుగుల‌కు కుప్పకూలింది. 

కెప్టెన్ ఇబ్రహీం జద్రన్ (25) మినహా మిగతావాళ్లు బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో నితీశ్ కుమార్ రెడ్డి, రవి బిష్ణోయి చెరో 3 వికెట్లు తీయగా, అక్షర్ పటేల్ 2 వికెట్లు, యశ్ ఠాకూర్‌, బుమ్రాలు తలా ఒక వికెట్ పడగొట్టారు. అంత‌క‌ముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 221 ప‌రుగులు చేసింది. 

అభిషేక్ శ‌ర్మ (34 బంతుల్లో 108; 9 ఫోర్లు, 11 సిక్స‌ర్లు) శ‌త‌కంతో విధ్వంసం సృష్టించ‌గా.. సంజూ శాంస‌న్ (35 బంతుల్లో 50) అర్థ‌సెంచ‌రీ సాధించాడు. కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ (29) రాణించాడు. అఫ్గానిస్తాన్ బౌల‌ర్ల‌లో అజ్మతుల్లా ఒమ‌ర్‌జ‌య్ 2 వికెట్లు తీయ‌గా.. ర‌షీద్ ఖాన్‌, అబ్దుల్లా అహ్మ‌ద్‌జ‌య్ చెరొక వికెట్ తీశారు. అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ టీమిండియానే విజయం సాధించి ఆఫ్గన్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. శతకంతో చెలరేగిన ఓపెనర్ అభిషేక్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’ అవార్డు లభించింది.

ఇదీ చదవండి: అభిషేక్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీ.. టీమిండియా భారీ స్కోర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement