'న‌మ్మినందుకు ఇరగదీస్తున్నాడు.. గిల్‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందే' | Ajay Jadeja-Rahane Praise Manav Suthar-Performance-Thanks-To-Gill | Sakshi
Sakshi News home page

Manav Suthar: 'న‌మ్మినందుకు ఇరగదీస్తున్నాడు.. గిల్‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందే'

Aug 17 2026 12:46 PM | Updated on Aug 17 2026 1:00 PM

Ajay Jadeja-Rahane Praise Manav Suthar-Performance-Thanks-To-Gill

Photo Credit: BCCI Twitter

గాలే వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో భార‌త స్పిన్న‌ర్ మాన‌వ్ సుతార్ త‌నకు అందివ‌చ్చిన అవ‌కాశాన్ని రెండు చేతులా ఒడిసిప‌ట్టాడు. మ్యాచ్‌లో ఇప్ప‌టికే మాన‌వ్ సుతార్ రెండు కీల‌క వికెట్లు తీశాడు. 27 ప‌రుగుల‌తో నిల‌క‌డ‌గా ఆడుతున్న లాహిరు ఉడారాను బోల్తా కొట్టించిన మాన‌వ్ సుతార్ ఆ వెంట‌నే ఇన్‌ఫామ్ బ్యాట‌ర్ దినేశ్ చందిమ‌ల్‌ను తెలివిగా బుట్ట‌లో వేసుకున్నాడు. 

‘బిగ్‌ స్పిన్నర్‌ అవుతాడు’
ఈ నేప‌థ్యంలో మాన‌వ్ సుతార్‌పై టీమిండియా మాజీ క్రికెట‌ర్లు అజ‌య్ జ‌డేజా, అజింక్య ర‌హానేలు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. తొలి టెస్టుకు ఈ ఇద్ద‌రు కామెంటేట‌ర్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. చందిమ‌ల్‌ను ఔట్ చేసిన త‌ర్వాత అజ‌య్ జ‌డేజా మాట్లాడుతూ.. "టీమిండియా బిగ్ స్పిన్న‌ర్ అయ్యేందుకు మాన‌వ్ సుతార్‌కు అన్ని అర్హ‌తలు ఉన్నాయి.  

బంతిని ట‌ర్న్ చేయ‌డంలో అత‌డి సామ‌ర్థ్యం అసాధార‌ణ‌మైన‌ది. దీంతో లంక బ్యాట‌ర్లు అత‌డిని ఎదుర్కోవ‌డానికి తెగ ఇబ్బంది పడుతున్నారు. మాన‌వ్ సుతార్‌పై న‌మ్మ‌క‌ముంచి అత‌డికి అవ‌కాశం క‌ల్పించిన కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందే" అని చెప్పుకొచ్చాడు. అజ‌య్ జ‌డేజా వ్యాఖ్య‌ల‌ను ర‌హానే స‌మ‌ర్ధించాడు. 

ఆ ఇద్దరిని కలగలిపి..
"జ‌డేజా భాయ్‌, నేను మీ వ్యాఖ్య‌ల‌తో పూర్తిగా ఏకీభ‌విస్తున్నా. టెస్టు క్రికెట్‌లో టీమిండియాకు మ్యాచ్ విన్న‌ర్‌గా మారే స‌త్తా మాన‌వ్ సుతార్‌కు ఉంది. లంక పిచ్‌ల‌పై అత‌డు అద్భుత‌మైన ట‌ర్న్‌ను రాబ‌డుతున్నాడు. అత‌డి బౌలింగ్‌లో జ‌డేజాలో ఉండే క‌చ్చిత‌త్వం, అశ్విన్ లాగా బంతిని ట‌ర్న్ చేయ‌డం లాంటి రెండు సామ‌ర్థ్యాలు ఒకేసారి ఉండ‌డం సానుకూలాంశం. భ‌విష్య‌త్తులో భార‌త క్రికెట్‌లో మాన‌వ్ సుతార్ కీల‌క పాత్ర పోషించ‌నున్నాడు" అని ర‌హానే పేర్కొన్నాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. భార‌త్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 462 ప‌రుగుల‌కు ఆలౌటైంది. 460 ప‌రుగుల ఓవ‌ర్‌నైట్ స్కోరుకు మ‌రో రెండు ప‌రుగులు జోడించిన అనంత‌రం చివ‌రి వికెట్ కోల్పోయింది. దేవ‌దత్ ప‌డిక్క‌ల్ (167) సెంచ‌రీతో రాణించ‌గా, ఓపెన‌ర్ కేఎల్ రాహుల్ (82), ధ్రువ్ జురెల్ (51) అర్ధ‌శ‌త‌కాల‌తో మెరిశారు. లంక బౌలర్ల‌లో ప్ర‌బాత్ జ‌య‌సూరియా 4 వికెట్లు తీయ‌గా, కేషారా నువంతా 3, అశితా ఫెర్నాండో 2 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

ఇక మూడో రోజు ఆటలో లంచ్‌ విరామ సమయానికి శ్రీలంక 5 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. సోనాల్‌ దినుష (14), నిరోషన్‌ డిక్‌వెల్లా (8) పరుగులతో క్రీజులో ఉన్నారు. మానవ్‌ సుతార్‌ రెండు, కుల్దీప్‌, జడేజా, సిరాజ్‌ తలా ఒక వికెట్‌ తీశారు. పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలిస్తుండడంతో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. 

 

Read: తప్పించాలని డిమాండ్లు; బ్యాట్‌తోనే జవాబు.. ఆ ఇద్దరి వల్లే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement