అబుదాబి: రాజస్తాన్ రాయల్స్- ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఆదివారం ఆసక్తికర మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ముంబై నిర్దేశించిన 196 పరుగుల భారీ టార్గెట్‌ను రాజస్తాన్ సునాయాసంగా ఛేదించింది. తమ బ్యాటింగ్‌లో పవర్ చూపెట్టిన రాజస్తాన్.. ముంబై ఇండియన్స్‌ను రప్ఫాడించింది. బెన్ స్టోక్స్(107 నాటౌట్; 60 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లు), సంజూ శాంసన్(54 నాటౌట్; 31 బంతుల్లో 4 ఫోర్లు, 3సిక్స్‌లు)లు చెలరేగిపోవడంతో రాజస్తాన్ 18.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అధిగమించింది.ఈ జోడి అజేయంగా 152 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో రాజస్తాన్ అలవోకగా విజయం సాధించింది.(నవదీప్ సైనీ అనుమానమే?)
అయితే మ్యాచ్‌కు ముందు రాజస్తాన్ పేసర్ జోఫ్రా ఆర్చర్.. ముంబై ఇండియన్స్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్ యాక్షన్‌ను కాపీ చేశాడు. బుమ్రా తరహాలో బంతిని రెండు చేతులతో గట్టిగా పట్టుకుని మెల్లగా రనప్ తీసుకునే యాక్షన్‌ను ఆర్చర్ అనుకరించాడు. ఆ క్రమంలోనే తన నవ్వును ఆపులేకపోయాడు ఆర్చర్. దీన్ని ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. బుమ్రాను ఆర్చర్ అనుసరించే యత్నం చేశాడని క్యాప్షన్‌ను ఇచ్చింది. ఇది మరొకసారి క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరించింది. ఈ సీజన్‌లో వీరిద్దరూ ప్రస్తుతం టాప్-5లో కొనసాగుతున్నారు. ఆర్చర్-బుమ్రాలు తలో 17 వికెట్లు సాధించారు. ఆర్చర్ 12 మ్యాచ్‌ల్లో 6.71 ఎకానమీతో 17 వికెట్లు సాధించగా, బుమ్రా 11 మ్యాచ్‌ల్లో 7.52 ఎకానమీతో 17 వికెట్లు తీశాడు.
Comments
Please login to add a commentAdd a comment