Ashes 2nd Test: Steve Smith To Lead Australia In Adelaide Test After Pat Cummins Ruled Out - Sakshi
Sakshi News home page

Ashes 2021-22 Adelaide Test: ఆఖరి నిమిషంలో మార్పు.. పాట్‌ కమిన్స్‌ అవుట్‌.. కెప్టెన్‌గా మళ్లీ స్టీవ్‌ స్మిత్‌!

Published Thu, Dec 16 2021 9:57 AM | Last Updated on Thu, Dec 16 2021 10:55 AM

Ashes 2nd Test: Australia Captain Pat Cummins Ruled Out Steve Smith To Lead - Sakshi

Ashes 2021-22 Adelaide Test: యాషెస్‌ సిరీస్‌లో భాగంగా రెండో టెస్టు నేపథ్యంలో ఆఖరి నిమిషంలో ఆస్ట్రేలియా జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్ ‌స్థానంలో మాజీ సారథి స్టీవ్‌ స్మిత్‌ బాధ్యతలు చేపట్టాడు. ఈ విషయాన్ని క్రికెట్‌ ఆస్ట్రేలియా ధ్రువీకరించింది. అదే విధంగా మైఖేల్‌ నెసర్‌ యాషెస్‌లో అరంగేట్రం చేయనున్నట్లు వెల్లడించింది.

కాగా అడిలైడ్‌ టెస్టుకు ముందు డిన్నర్‌ కోసం రెస్టారెంట్‌కు వెళ్లిన కమిన్స్‌ అక్కడ కోవిడ్‌ పాజిటివ్‌ వ్యక్తికి సన్నిహితంగా మెలిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అతడు జట్టు నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కమిన్స్‌ ఏడు రోజుల పాటు ఐసోలేషన్‌లో గడపాల్సి ఉండగా.. స్మిత్‌ మరోసారి సారథ్య బాధ్యతలు చేపట్టాడు. కాగా అడిలైడ్‌ వేదికగా డిసెంబరు 16 నుంచి ఆసీస్‌- ఇంగ్లండ్‌ మధ్య రెండో టెస్టు ఆరంభమైంది. టాస్‌ గెలిచిన ఆసీస్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇక తొలి మ్యాచ్‌లో విజయం సాధించి ఆతిథ్య జట్టు ఆసీస్‌ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.

అడిలైడ్‌ టెస్టు- ఆసీస్‌ తుది జట్టు:
డేవిడ్‌ వార్నర్‌, మార్కస్‌ హారిస్‌, మార్నస్‌ లబుషేన్‌, స్టీవెన్‌ స్మిత్‌(కెప్టెన్‌), ట్రావిస్‌ హెడ్‌, కామెరూన్‌ గ్రీన్‌, అలెక్స్‌ క్యారీ(వికెట్‌ కీపర్‌), మైఖేల్‌ నెసర్‌, మిచెల్‌ స్టార్క్‌, జై రిచర్డ్‌సన్‌, నాథన్‌ లియాన్‌.

ఇంగ్లండ్‌ తుది జట్టు:
రోరీ బర్న్స్‌', హసీబ్‌ హమీద్‌, డేవిడ్‌ మలన్‌, జో రూట్‌(కెప్టెన్‌), బెన్‌ స్టోక్స్‌, ఓలీ పోప్‌, జోస్‌ బట్లర్‌(వికెట్‌ కీపర్‌), క్రిస్‌ వోక్స్‌, ఓలీ రాబిన్సన్‌, స్టువర్‌ బ్రాడ్‌, జేమ్స్‌ అండర్సన్‌.

చదవండి: India Tour of South Africa: దక్షిణాఫ్రికాకు బయల్దేరిన టీమిండియా.. ఈసారైనా కల నెరవేరేనా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement