Ashes 2021-22: Scott Boland Enters Australia Squad for Boxing Day Test - Sakshi
Sakshi News home page

Ashes Series 3rd Test: ఆసీస్‌ యూటర్న్‌...15 కాదు.. 16.. స్కాట్‌ బోలాండ్‌ ఎంట్రీ!

Published Tue, Dec 21 2021 11:30 AM | Last Updated on Tue, Dec 21 2021 12:53 PM

Ashes Series: Scott Boland Enters Australia Squad Ahead Boxing Day Test - Sakshi

PC: cricketcomau

Scott Boland In Australia Squad: యాషెస్‌ సిరీస్‌ నేపథ్యంలో తదుపరి మూడు టెస్టులకు పాత జట్టుతోనే ముందుకు వెళ్తామన్న ఆస్ట్రేలియా యూటర్న్‌ తీసుకుంది. జట్టులోకి కొత్త సభ్యుడు వస్తున్నట్లు తెలిపింది. ఫాస్ట్‌ బౌలర్‌ స్కాట్‌ బోలాండ్‌ జట్టులోకి ఎంట్రీ ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు... ‘‘రెండో టెస్టు విజయానంతరం ఫాస్ట్‌ బౌలింగ్‌ గ్రూపు వైద్య బృందం పర్యవేక్షణలో ఉంది.  అడిలైడ్‌లో జట్టుతో శిక్షణ తీసుకున్న బోలాండ్‌ టీమ్‌లో చేరతాడు’’అని క్రికెట్‌ ఆస్ట్రేలియా తమ ప్రకటనలో పేర్కొంది.  

కాగా ఇప్పటికే జోష్‌ హాజిల్‌వుడ్‌ గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. అదే విధంగా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ సైతం కోవిడ్‌ వ్యక్తికి సన్నిహితంగా మెలిగిన కారణంగా ఐసోలేషన్‌లో ఉండాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో జట్టులో ఉన్న పేసర్లపై పనిభారాన్ని తగ్గించేందుకు క్రికెట్‌ ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా బాక్సిండ్‌ డే మ్యాచ్‌తో బోలాండ్‌ టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడు. ఇక ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌లో తొలి రెండు టెస్టుల్లో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించి ఆస్ట్రేలియా 2-0 ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.

ఆస్ట్రేలియా జట్టు:
పాట్‌ కమిన్స్‌(కెప్టెన్‌), స్టీవ్‌ స్మిత్‌(వైస్‌ కెప్టెన్‌), అలెక్స్‌ క్యారీ(వికెట్‌ కీపర్‌), కామెరూన్‌ గ్రీన్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌, మార్కస్‌ హారిస్‌, ట్రావిస్‌ హెడ్‌, ఉస్మాన్‌ ఖవాజా, మార్నస్‌ లబుషేన్‌, నాథన్‌ లియాన్‌, మైఖేల్‌ నెసర్‌, జై రిచర్డ్‌సన్‌, మిచెల్‌ స్టార్క్‌, మిచెల్‌ స్వెప్సన్‌, డేవిడ్‌ వార్నర్‌, స్కాట్‌ బోలాండ్‌.

చదవండి: Ashes Series 2nd Test: అసలేం చేస్తున్నావు.. నువ్వు కెప్టెన్‌గా ఉండి ఏం లాభం: రికీ పాంటింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement