Ashes Series 5th Test: ఆస్ట్రేలియా మరోసారి అద్భుతంగా రాణించింది. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఐదో టెస్టులో ఇంగ్లండ్‌పై 146 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది. ప్రతిష్టాత్మక ట్రోఫీని 4-0 తేడాతో కైవసం చేసుకుంది. సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన.. ట్రవిస్ హెడ్ ఆఖరి టెస్టులోనూ మరోసారి సెంచరీతో మెరిశాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.
ఇక డే–నైట్‌గా జరిగిన ఈ టెస్టు మూడు రోజుల్లోనే ముగియడం విశేషం. బోలండ్ (3/18), గ్రీన్ (3/21), కమిన్స్ (3/42) ఇంగ్లండ్‌ను దెబ్బతీశారు. ఇక పర్యాటక జట్టు ఇంగ్లండ్‌కు మాత్రం ఈ సిరీస్ చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌లోనూ గెలవలేక చతికిలపడింది. నాలుగో టెస్టును డ్రా చేసుకోవడం వారికి కాస్త ఊరట కలిగించే అంశం. ఇదిలా ఉంటే... ఏకపక్ష విజయాలతో కంగారూలు రెట్టించిన ఉత్సాహంతో అంబరాన్నంటేలా సంబరాలు చేసుకుంటున్నారు.
(చదవండి: టెస్ట్ కెప్టెన్సీకి విరాట్ గుడ్‌బై.. అనుష్క ఎమోషనల్ పోస్ట్)
యాషెస్ సిరీస్- ఐదో టెస్టు స్కోర్లు:
ఆస్ట్రేలియా : 303 & 155.
ఇంగ్లండ్: 188 & 124.
యాషెస్ సిరీస్ 2021-2022లో ఆస్ట్రేలియా విజయ పరంపర:
బ్రిస్బేన్ టెస్టు- 9 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై ఆసీస్ గెలుపు
అడిలైడ్ టెస్టు: 275 పరుగుల తేడాతో ఘన విజయం
మెల్‌బోర్న్ టెస్టు: ఇన్నింగ్స్ మీద 14 పరుగుల తేడాతో భారీ విజయం
సిడ్నీ టెస్టు: డ్రా
హోబర్ట్ టెస్టు: 146 పరుగుల తేడాతో కంగారూల జయకేతనం
Just put out the one mitt - and it stuck! #Ashes pic.twitter.com/10yK7Cadc3
— cricket.com.au (@cricketcomau) January 16, 2022
A famous first-class debut and now celebrating a 4-0 #Ashes win - Cameron Green will have some fond memories of Bellerive Oval! @alintaenergy pic.twitter.com/L9X40oSU4p
— cricket.com.au (@cricketcomau) January 17, 2022
Comments
Please login to add a commentAdd a comment