పల్లెకెలె: ఆసియా కప్ వన్డే క్రికెట్ టోర్నీలో శ్రీలంక 5 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన బంగ్లాదేశ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకొని 42.4 ఓవర్లలో 164 పరుగులకే ఆలౌటైంది. నజు్మల్ హొసేన్ (122 బంతుల్లో 89; 7 ఫోర్లు) ఒంటరి పోరాటం చేశాడు. కెప్టెన్ షకీబ్ (5) సహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లే చేయలేదు.
ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మతీశా పతిరన (4/32) బంగ్లాదేశ్ వెన్నువిరిచాడు. తీక్షణకు 2 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక 39 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసి గెలిచింది. చరిత్ అసలంక (92 బంతుల్లో 62 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), సమరవిక్రమ (77 బంతుల్లో 54; 6 సిక్స్‌లు) రాణించారు. ఇద్దరు నాలుగో వికెట్‌కు 78 పరుగులు జోడించారు. నేడు మ్యాచ్‌లకు విశ్రాంతి దినం. శనివారం ఇదే మైదానంలో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది.
స్కోరు వివరాలు
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: నయీమ్ (సి) నిసాంక (బి) ధనంజయ 16; తాన్‌జిద్ హసన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) తీక్షణ 0; నజు్మల్ (బి) తీక్షణ 89; షకీబ్ (సి) కుశాల్ (బి) పతిరన 5; తౌహిద్ (ఎల్బీడబ్ల్యూ) (బి) షనక 20; రహీమ్ (సి) కరుణరత్నే (బి) పతిరన 13; మిరాజ్ (రనౌట్) 5; మెహిదీ హసన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వెలలగె 6; తస్కిన్ (సి) తీక్షణ (బి) పతిరన 0; ఇస్లామ్ (నాటౌట్) 2; ముస్తాఫిజుర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) పతిరన 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (42.4 ఓవర్లలో ఆలౌట్) 164. వికెట్ల పతనం: 1–4, 2–25, 3–36, 4–95, 5–127, 6–141, 7–162, 8–162, 9–164, 10–164. బౌలింగ్: కసున్ రజిత 7–0–29–0, తీక్షణ 8–1–19–2, ధనంజయ 10–0–35–1, పతిరన 7.4–0–32–4, వెలలగె 7–0–30–1, షనక 3–0–16–1.
శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (సి) రహీమ్ (బి) ఇస్లామ్ 14; కరుణరత్నే (బి) తస్కిన్ 1; కుశాల్ (బి) షకీబ్ 5; సమరవిక్రమ (స్టంప్డ్) రహీమ్ (బి) మెహదీ హసన్ 54; అసలంక (నాటౌట్) 62; ధనంజయ (బి) షకీబ్ 2; షనక (నాటౌట్) 14; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (39 ఓవర్లలో 5 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–13, 2–15, 3–43, 4–121, 5–128. బౌలింగ్: టస్కిన్ 7–1–34–1, ఇస్లామ్ 4–0–23–1, షకీబ్ 10–2–29–2, ముస్తఫిజుర్ 3–0–12–0, మిరాజ్ 5–0–26–0, మెహదీ హసన్ 10–0–35–1.
చదవండి: ‘వయాకామ్ 18’ చేతికి భారత క్రికెట్
Comments
Please login to add a commentAdd a comment