ఆసియాకప్-2023లో శ్రీలంక బోణీ కొట్టింది. పల్లెకెలె వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 42.4 ఓవర్లలో 164 పరుగులకే ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో నజుముల్ హొసేన్ శాంటో(89) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.
శ్రీలంక బౌలర్లలో యువ సంచలనం మతీశా పతిరన నాలుగు వికెట్లతో బంగ్లాను దెబ్బతీశాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక 39 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసి గెలిచింది. చరిత్ అసలంక (92 బంతుల్లో 62 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), సమరవిక్రమ (77 బంతుల్లో 54; 6 సిక్స్‌లు) రాణించారు.
చరిత్ర సృష్టించిన శ్రీలంక..
ఇక ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఓ అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. వన్డేల్లో వరుసగా అత్యధిక సార్లు ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేసిన టీమ్‌గా శ్రీలంక నిలిచింది. ఈ మ్యాచ్‌లో బంగ్గాదేశ్‌ను ఆలౌట్ చేసిన లంక.. ఈ ఘనతను తమ పేరిట లిఖించుకుంది.
లంక వరుసగా 11 సార్లు ప్రత్యర్ధి జట్టును ఆలౌట్ చేసింది. అంతకముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా పేరిట ఉండేది. ఈ రెండు జట్లు వరుసగా 10 సార్లు ప్రత్యర్ధి జట్టును ఆలౌట్ చేశాయి.
చదవండి: Asia Cup 2023: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన శ్రీలంక.. 5 వికెట్ల తేడాతో ఘన విజయం
Comments
Please login to add a commentAdd a comment