IND vs SL 2nd Test: Axar Patel Joins Team India Test Squad - Sakshi
Sakshi News home page

IND vs SL: శ్రీలంకతో రెండో టెస్ట్‌.. టీమిండియాకు గుడ్‌ న్యూస్‌!

Published Mon, Mar 7 2022 3:58 PM | Last Updated on Mon, Mar 7 2022 8:36 PM

Axar Patel joins Team India squad ahead of 2nd Test - Sakshi

శ్రీలంకతో రెండో టెస్టుకు ముందు టీమిండియాకు గుడ్‌ న్యూస్‌.. గాయం కారణంగా జట్టుకు దూరమైన స్టార్‌ ఆల్‌ రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ తిరిగి జట్టులోకి చేరాడు. శ్రీలంకతో జరిగే రెండో టెస్టుకు అక్షర్‌ పటేల్‌కు తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ఇక శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు అక్షర్‌ పటేల్‌ స్ధానంలో ఎంపికైన కుల్ధీప్‌ యాదవ్‌ జట్టు నుంచి తప్పుకున్నాడు. గత ఏడాది స్వదేశంలో న్యూజిలాడ్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో అక్షర్‌ పటేల్‌ గాయపడ్డాడు. దీంతో దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమయ్యాడు. "అక్షర్‌ పటేల్‌ పూర్తిగా గాయం నుంచి కోలుకున్నాడు. రెండో టెస్టుకు అతడు జట్టుకు అందుబాటులో ఉండనున్నాడు.

అతడికి బ్యాకప్‌గా ఎంపిక చేసిన కుల్ధీప్‌ యాదవ్‌ జట్టు నుంచి బయటకు వచ్చాడు" అని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇక మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్‌ ఇన్నింగ్స్‌ అండ్‌ 222 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజా అద్భుతంగా రాణించాడు. తొలి టెస్టులో 175 పరుగులతో పాటు 9 వికెట్లు పడగొట్టాడు. ఇక బెంగళూరు వేదికగా మార్చి 12న భారత్‌- శ్రీలంక రెండో టెస్టు ప్రారంభం కానుంది.

చదవండి: IND vs SL: 'మూడు రోజుల్లోనే మ్యాచ్‌ ముగించాడు.. రోహిత్‌ అద్భుతమైన కెప్టెన్‌'


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement