బీసీసీఐ జీఎస్టీ చెల్లింపులు రూ.2038 కోట్లు | BCCI Paid Over Rs 2000 Crore GST In FY23 And FY24 Says Minister | Sakshi
Sakshi News home page

బీసీసీఐ జీఎస్టీ చెల్లింపులు రూ.2038 కోట్లు

Published Wed, Aug 7 2024 10:25 AM | Last Updated on Wed, Aug 7 2024 11:06 AM

BCCI Paid Over Rs 2000 Crore GST In FY23 And FY24 Says Minister

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) గత రెండేళ్లుగా రూ. 2038.55 కోట్లను జీఎస్టీ రూపంలో చెల్లించినట్లు రాజ్యసభలో తెలిపారు. మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఎగువసభలోని ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి సమాధానమిచ్చారు. 

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) నిర్వహణ ద్వారా 2022–23, 2023–24 ఈ రెండు ఆర్థిక సంవత్సరాలకు గాను 28 శాతం జీఎస్టీ రూపంలో బోర్డు స్థూలంగా రూ. 2038.55 కోట్లు చెల్లించిందని లిఖితపూర్వకంగా రాజ్యసభలో తెలిపారు. ఆదాయపన్ను శాఖ నుంచి చారిటీలకు వర్తింపచేస్తున్న మినహాయింపును బీసీసీఐకి తొలగించడంతో ఈ మేరకు బోర్డు చెల్లించిందని మంత్రి పంకజ్‌ చౌదరి వివరించారు. 

కాగా బీసీసీఐ ‘తమిళనాడు సొసైటీల రిజిస్ట్రేషన్‌ చట్టం 1975’కు లోబడి రిజిస్టరైన సంస్థ. అయితే ఇన్నాళ్లు చారిటీల గొడుగుకింద సెక్షన్‌ 11 ప్రకారం పన్ను మినహాయింపు పొందేది. అయితే ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో ఉందని ఆయన చెప్పారు. అలాగే కేంద్ర క్రీడా శాఖ నుంచి ఎలాంటి గ్రాంట్లు, నిధులు, పథకాలు క్రికెట్‌ బోర్డు పొందడం లేదని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement