ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ వేదికలు, వివాదాస్పద 'ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనకు సంబంధించి బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా శనివారం రాత్రి కీలక ప్రకటన చేశారు. ఐపీఎల్ 2026 సీజన్‌లో క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్, క్వాలిఫైయర్ 2 సహా ఫైనల్‌కు సంబంధించి ముఖ్య విషయం వెల్లడించారు.
ఈ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చే వేదికలను మరో రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నట్లు సైకియా తెలిపారు. ప్లేఆఫ్స్, ఫైనల్ నిర్వహణకు తగిన వేదికల ఎంపికపై బోర్డు ప్రస్తుతం కసరత్తు చేస్తోందని పేర్కొన్నారు. ఇక 2023లో ప్రవేశపెట్టిన 'ఇంపాక్ట్ ప్లేయర్' నిబంధనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సైకియా స్పందించారు.
ఈ నిబంధన వల్ల అభిమానులు మ్యాచ్‌లను బాగా ఎంజాయ్ చేస్తున్నారని, కొన్ని జట్లు 260 పరుగులు చేస్తే, మరికొన్ని తక్కువ స్కోర్లకే పరిమితమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఇంపాక్ట్ రూల్‌పై ఫ్రాంచైజీల నుంచి ఎటువంటి అధికారిక ఫిర్యాదులు అందలేదని, జట్లు దీనితో సౌకర్యవంతంగానే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
కాగా ఐపీఎల్‌లో లీగ్ మ్యాచ్‌లు మే 24తో ముగియనున్నాయి. ఇప్పటికైతే పాయింట్ల పరంగా పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ, ఎస్ఆర్‌హెచ్, రాజస్తాన్ రాయల్స్ వరుసగా తొలి నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి.
చదవండి: తిలక్ వర్మకు చేదు అనుభవం!


