
పుణె: టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో విశ్వరూపం ప్రదర్శించి జట్టును విజయతీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్. తృటిలో సెంచరీ చేజార్చుకున్నా, జట్టుకు కీలకమైన సమయంలో అతడు చేసిన 99 పరుగులు వంద కంటే ఎక్కువ విలువైనవి అనడంలో అతిశయోక్తి లేదు. శుక్రవారం నాటి మ్యాచ్‌లో 52 బంతులు ఎదుర్కొన్న స్టోక్స్, 4 ఫోర్లు, 10 సిక్సర్లు బాది సత్తా చాటాడు. ఇక భువనేశ్వర్ బౌలింగ్‌లో రనౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్న స్టోక్స్, చివరికి అతడి బౌలింగ్‌లోనే పంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
కాగా సుదీర్ఘంగా సాగుతున్న భారత పర్యటనలో ఇంతవరకు తన స్థాయి ప్రదర్శన కనబరచని స్టోక్స్ ఈ మ్యాచ్‌తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో నిన్నటి నుంచి ట్రెండింగ్‌లో ఉన్న స్టోక్స్.. తమ జట్టుకు సంబంధించిన ఓ సీక్రెట్‌ను వెల్లడించి సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్నాడు. ఇంతకీ ఆ రహస్యం ఏమిటంటే.. ఇంగ్లండ్ జట్టు ఆటగాళ్లంతా మ్యాచ్ ముందు, మహిళలు వాడే డియోడ్రెంట్లే ఉపయోగిస్తారట. ఈ విషయం గురించి స్టోక్స్ మాట్లాడుతూ.. ‘‘ఆ సువాసన ఎంతో బాగుంటుంది. నాకైతే దానిమ్మకు సంబంధించిన ఫ్లేవర్ ఇష్టం. నేనొక్కడినే కాదు, మా టీం మొత్తం వుమెన్ డియోడ్రింట్లే ఉపయోగిస్తారు’’ అని చెప్పుకొచ్చాడు. ఈ విషయంపై నెటిజన్లు తమదైన శైలిలో జోకులు పేలుస్తున్నారు.
చదవండి: కోహ్లి మాస్టర్‌క్లాస్ కావొచ్చు.. అయితే నాకేంటి!?
సారీ నాన్న.. ఆ మార్క్‌ను అందుకోలేకపోయా
Comments
Please login to add a commentAdd a comment