బెన్‌స్టోక్స్‌కు అంపైర్‌ వార్నింగ్‌.. ఇంకోసారి ఇలా చేస్తే! | Ben Stokes Was Warned By The Umpire After He Applied Saliva On Ball | Sakshi
Sakshi News home page

బెన్‌స్టోక్స్‌కు అంపైర్‌ వార్నింగ్‌.. ఏం చేశాడంటే!

Published Fri, Mar 26 2021 3:18 PM | Last Updated on Fri, Mar 26 2021 4:36 PM

Ben Stokes Was Warned By The Umpire After He Applied Saliva On Ball - Sakshi

ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌(ఫొటో కర్టెసీ: రాయిటర్స్‌)

పుణె: మహమ్మారి కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో బంతిని షైన్‌చేసే క్రమంలో బౌలర్లు లాలాజలం(సెలైవా) ఉపయోగించే అంశంపై నిబంధనలు కొనసాగుతున్న విషయం విదితమే. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి నిబంధనల ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో సెలైవా ఉపయోగించడం నిషేధం. ఒకవేళ ఎవరైననా ఈ రూల్స్‌ అతిక్రమిస్తే మొదటిసారి హెచ్చరిస్తారు. రెండోసారి కూడా పునరావృతం చేస్తే, సదరు ఆటగాడు ప్రాతినిథ్య వహిస్తున్న జట్టుకు ఐదు పరుగుల జరిమానా విధిస్తారు.

తాజాగా, మరోసారి కరోనా కోరలు చాస్తున్న వేళ టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో పర్యాటక జట్టు ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ సెలైవా ఉపయోగించడం చర్చనీయాంశమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో రీస్‌ టోప్లీ.. నాలుగో ఓవర్‌ రెండో బంతి వేసిన తర్వాత బాల్‌ను తీసుకున్న స్టోక్స్‌ సెలైవా అప్లై చేశాడు. దీంతో అంపైర్‌ వీరేందర్‌ శర్మ అతడికి వార్నింగ్‌ ఇచ్చాడు. అంతేగాక విషయాన్ని తాత్కాలిక కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌కు తెలియజేశాడు. కాగా ఈ ఘటన అనంతరం బంతిని సానిటైజ్‌ చేశారు.

చదవండి: కోహ్లిలా దూకుడుగా ఉండటం మా విధానం కాదు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement