సారీ నాన్న.. ఆ మార్క్‌ను అందుకోలేకపోయా | Ben Stokes Says Sorry To Late Father After Missing Ton In 2nd ODI | Sakshi
Sakshi News home page

సారీ నాన్న.. ఆ మార్క్‌ను అందుకోలేకపోయా

Published Sat, Mar 27 2021 2:22 PM | Last Updated on Sat, Mar 27 2021 3:41 PM

Ben Stokes Says Sorry To Late Father After Missing Ton In 2nd ODI - Sakshi

పుణే: టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ విధ్వంసం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రనౌట్‌ ప్రమాదం నుంచి తప్పించుకున్న స్టోక్స్‌ ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 52 బంతుల్లోనే 99 పరుగులు సాధించిన స్టోక్స్‌ ఇన్నింగ్స్‌లో 10 సిక్సర్లు.. 4 ఫోర్లు ఉండడం విశేషం. అయితే కేవలం ఒక్క పరుగు తేడాతో సెంచరీ చేజార్చుకోవడం బాధ కలిగించినా.. మ్యాచ్‌​విజయంలో కీలకపాత్ర పోషించినందుకు సంతోషంగా ఉన్నానంటూ స్టోక్స్‌ విజయం అనంతరం పేర్కొన్నాడు.

ఈ నేపథ్యంలో స్టోక్స్‌ సెంచరీ మార్క్‌ను అందుకోలేకపోయినందుకు ఆకాశంలోకి చూస్తూ తన తండ్రికి సారీ చెప్పిన వీడియో వైరల్‌గా మారింది. 99 పరుగుల వద్ద ఔట్‌ అయినప్పుడు నిరాశగా పెవిలియన్‌ వైపు వెళుతూ ఆకాశంలోకి చూస్తూ క్షమించమన్నట్లుగా స్టోక్స్‌ చేతులతో సైగలు చేశాడు. ఈ వీడియోను ఒక వ్యక్తి ట్విటర్‌లో షేర్‌ చేశాడు. కాగా స్టోక్స్‌ తండ్రి గెడ్‌ స్టోక్స్‌ గతేడాది బ్రెయిన్‌ క్యాన్సర్‌తో మరణించిన సంగతి తెలిసిందే.

మ్యాచ్‌ విషయానికి వస్తే ముందుగా భారత్‌ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ (114 బంతుల్లో 108; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో మెరవగా .. రిషభ్‌ పంత్‌ (40 బంతుల్లో 77; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) రాణించాడు. అనంతరం ఇంగ్లండ్‌ 43.3 ఓవర్లలో 4 వికెట్లకు 337 పరుగులు చేసి గెలిచింది. బెయిర్‌స్టో (112 బంతుల్లో 124; 11 ఫోర్లు, 7 సిక్సర్లు) శతకం సాధించగా... స్టోక్స్‌ (52 బంతుల్లో 99; 4 ఫోర్లు, 10 సిక్సర్లు), జేసన్‌ రాయ్‌ (52 బంతుల్లో 55; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అండగా నిలిచారు. ఇరు జట్లకు కీలకమైన మూడో వన్డే రేపు(ఆదివారం) జరగనుంది. 
చదవండి: 
రనౌట్‌ వివాదం.. స్టోక్స్‌ అవుటా.. కాదా?

బెన్‌స్టోక్స్‌కు అంపైర్‌ వార్నింగ్‌.. ఏం చేశాడంటే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement