Ind Vs Eng 3rd ODI: Shardul Shows Middle Finger To Opposition Batsmen Goes Viral - Sakshi
Sakshi News home page

వైరల్‌: ఆ వేలు ఎవరికి చూపించావు..శార్దూల్

Published Tue, Mar 30 2021 10:58 AM | Last Updated on Tue, Mar 30 2021 6:11 PM

Shardul Thakur Shows Middle Finger To Opposition Batsmen Became Viral - Sakshi

పుణే: ఇంగ్లండ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో టీమిండియా బౌలర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. మూడు వన్డేలు కలిపి 7 వికెట్లతో టీమిండియా తరపున లీడింగ్‌ వికెట్‌టేకర్‌గా నిలిచాడు. అంతేగాక మూడో వన్డేలో మొదట బ్యాటింగ్‌లో 21 బంతుల్లో 30 పరుగులు.. ఆ తర్వాత బౌలింగ్‌లో 4 వికెట్లు తీసి  మ్యాచ్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. వాస్తవానికి స్వింగ్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ 6 వికెట్లు తీసినా.. పొదుపు బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు.  

ఈ విషయం కాసేపు పక్కనపెడితే.. మూడో వన్డేలో శార్దూల్‌ చేసిన పని ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ సమయంలో ఒక ఓవర్‌లో శార్దూల్‌  వేసిన బంతి  అతనిపై ఫన్నీ మీమ్స్‌ వచ్చేలా చేశాయి. బంతిని వేసే క్రమంలో శార్దూల్‌ అన్ని వేళ్లు కిందకు దించి.. కేవలం మధ్య వేలు పైకి చూపుతూ బంతిని విసిరాడు. సాధారణంగా మధ్య వేలు చూపిస్తే చాలామందిలో డబుల్‌ మీనింగ్‌ డైలాగులు బయటికి వస్తుంటాయి. ఇప్పుడు శార్దూల్‌ను ట్రోల్‌ చేయడానికి అతని వేలు కారణమైంది. అతనిపై సోషల్‌ మీడియాలో ఫన్నీ మీమ్స్‌ వచ్చాయి.

''శార్దూల్‌.. ఆ వేలు ఎవరికి చూపిస్తున్నాడు.. నకల్‌ బాంతి లాగా శార్దూల్‌ ఫకల్‌ బంతిని కనిపెట్టాడు.. శార్దూల్‌ ఆ వేలిని తనను అసహ్యించుకునేవాళ్లకు చూపిస్తున్నాడు.. ఏంటి శార్దూల్‌  ఈ పని.. ఒక బ్యాట్స్‌మన్‌కు ఆ వేలు ఎలా చూపించగలవు..'' అంటూ కామెంట్లతో రెచ్చిపోయారు. ఇక టీమిండియా వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో గెలుచుకున్న సంగతి తెలిసిందే.
చదవండి:
కోలుకోవడానికి కనీసం 5నెలలు పట్టొచ్చంటున్న డాక్టర్లు 

టీమిండియా బౌలర్‌పై ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ ప్రశంసలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement