భువనేశ్వర్: ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ మహిళల అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) క్రీడాకారిణి డి.భాగ్యలక్ష్మి స్వర్ణ పతకాన్ని సాధించింది. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీకి చెందిన భాగ్యలక్ష్మి 1500 మీటర్ల విభాగంలో చాంపియన్‌గా నిలిచింది. ఆమె 4 నిమిషాల 27.82 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
వర్ష (కురుక్షేత్ర యూనివర్సిటీ– 4ని:30.01 సెకన్లు) రజతం, సునీత (హిమాచల్‌ప్రదేశ్ యూనివర్సిటీ–4ని:30.15 సెకన్లు) కాంస్యం సాధించారు. ‘ద్రోణాచార్య’ అవార్డీ నాగపురి రమేశ్ వద్ద శిక్షణ తీసుకుంటున్న భాగ్యలక్ష్మి విజేత హోదాలో ఈ ఏడాది జూన్–జూలైలో చైనాలో జరిగే ప్రపంచ యూనివర్సిటీ క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది.
చదవండి: IND Vs SL T20 Series: టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ.. గాయంతో సూర్యకుమార్ ఔట్
Comments
Please login to add a commentAdd a comment