లిస్బన్ : దిగ్గజ పుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోకు కరోనా వైరస్ పాజిటివ్ రావటంపై అతడి సోదరి కతియా అవీరో అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా పేరిట ప్రపంచవ్యాప్తంగా పెద్ద మోసం జరుగుతోందని ఆమె ఆరోపించారు. గురువారం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కతియా స్పందించారు. వరుస పోస్టులతో తన అసహనాన్ని వెళ్లగక్కారు. ‘‘ క్రిస్టియానో రొనాల్డో ప్రపంచాన్ని మేల్కొలిపే వ్యక్తని అంటే గనుక.. అతడు నిజంగా ఓ దేవదూతని చెబుతాను’’.. ‘‘నాతో పాటు కొన్ని వేల మంది ప్రజలు కరోనాను.. నిర్ధారణ పరీక్షలను.. తీసుకుంటున్న నివారణా చర్యలను నమ్ముతున్నారు. ఇది నేను నా జీవితంలో చూసిన అతి పెద్ద మోసం ’’ అని ఆమె పేర్కొన్నారు. (వైరల్ : రొనాల్డో నైటీ వేసుకున్నాడా? )
కాగా, రొనాల్డోకు కరోనా వైరస్ సోకిందని పోర్చుగీస్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ మంగళవారం అధికారికంగా ధ్రువీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం స్వీడన్‌తో తలపడాల్సిన నేషన్స్ లీగ్ మ్యాచ్‌నుంచి సైతం ఆయన వైదొలిగారు.
Comments
Please login to add a commentAdd a comment