20 పరుగుల తేడాతో రాజస్తాన్‌పై విజయం
చెలరేగిన ఫ్రేజర్, పోరెల్
సామ్సన్ పోరాటం వృథా
న్యూఢిల్లీ: జోరుమీదున్న రాజస్తాన్ రాయల్స్‌పై కీలకమైన విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ రేసులో పడింది. మంగళవారం జరిగిన ఐపీఎల్ పోరులో ఢిల్లీ 20 పరుగుల తేడాతో గెలిచింది. ఆరో విజయంతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.
ఓపెనర్లు జేక్ ఫ్రేజర్ మెగర్క్ (20 బంతుల్లో 50; 7 ఫోర్లు; 3 సిక్స్‌లు), అభిషేక్ పోరెల్ (36 బంతుల్లో 65; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) దంచేశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసి ఓడింది. కెపె్టన్ సంజూ సామ్సన్ (46 బంతుల్లో 86; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేశాడు. ఖలీల్, ముకేశ్, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కుల్దీప్ తలా 2 వికెట్లు తీశారు.
4,4,4,6,4,6...
ఓపెనర్లు ఫ్రేజర్, పోరెల్ ఒకరి తర్వాత ఒకరు రాయల్స్ బౌలర్లను చితగ్గొట్టారు. ముందుగా ఫ్రేజర్... బౌల్ట్ వేసిన మూడో ఓవర్లో ఒక సిక్స్, 2 బౌండరీలతో 15 పరుగులు రాబట్టాడు. అవేశ్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో 4, 4, 4, 6, 4, 6లతో 28 పరుగులు పిండుకోవడంతో ఫ్రేజర్ ఫిఫ్టీ 19 బంతుల్లోనే పూర్తయ్యింది. అతని దూకుడును అశ్విన్ తన తొలి ఓవర్లోనే అడ్డుకున్నాడు. అనంతరం అక్షర్ పటేల్ అండతో పోరెల్ బాదడం మొదలుపెట్టాడు.
9వ ఓవర్లో జట్టు స్కోరు వందకు చేరింది. మరుసటి ఓవర్లోనే అక్షర్ (15)ను అశ్విన్ బోల్తా కొట్టించగా, పోరెల్ సిక్సర్‌తో 28 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. వరుస ఓవర్లలో పోరెల్‌ను అశ్విన్... రిషభ్ పంత్ (15)ను చహల్ పెవిలియన్ పంపారు. మిడిలార్డర్‌లో స్టబ్స్ (20 బంతుల్లో 41; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడటంతో ఢిల్లీ 200 పైచిలుకు స్కోరు చేసింది.
కెప్టెన్ పోరాడినా...
క్లిష్టమైన లక్ష్యం ముందరుంటే ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (4), బట్లర్ (19) గట్టి పునాది వేయలేకపోయారు. ఈ దశలో కెపె్టన్ సామ్సన్, రియాన్ పరాగ్ (22 బంతుల్లో 27; 1 ఫోర్, 3 సిక్స్‌లు) అండతో రాయల్స్‌ను నడిపించాడు. 11వ ఓవర్లో జట్టు స్కోరు 100 పరుగులు దాటాక అదే ఓవర్ ఆఖరి బంతికి పరాగ్‌ను రసిఖ్ బౌల్డ్ చేశాడు.
అయితే శుభమ్ దూబే వచ్చాక సామ్సన్ 28 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న సామ్సన్‌ను ముకేశ్ అవుట్ చేయడం రాజస్తాన్‌ను కుదిపేసింది. శుభమ్‌తో నాలుగో వికెట్‌కు 59 పరుగులు జోడించాక భారీ షాట్‌కు ప్రయత్నించి సామ్సన్ నిష్క్రమించగా... తర్వాత ఓవర్‌కు ఒకటి, రెండు చొప్పున వికెట్లను కోల్పోయిన రాయల్స్ ఓటమి పాలైంది.
స్కోరు వివరాలు
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: ఫ్రేజర్ (సి) ఫెరీరా (బి) అశ్విన్ 50; పోరెల్ (సి) సందీప్ (బి) అశ్విన్ 65; షై హోప్ (రనౌట్) 1; అక్షర్ (సి) పరాగ్ (బి) అశ్విన్ 15; పంత్ (సి) బౌల్ట్ (బి) చహల్ 15; స్టబ్స్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సందీప్ 41; గుల్బదిన్ (సి) అశ్విన్ (బి) బౌల్ట్ 19; రసిఖ్ (రనౌట్) 9; కుల్దీప్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 221. వికెట్ల పతనం: 1–60, 2–68, 3–110, 4–144, 5–150, 6–195, 7–215, 8–221. బౌలింగ్: బౌల్ట్ 4–0–48–1, సందీప్ శర్మ 4–0–42–1, అవేశ్ 2–0–42–0, అశి్వన్ 4–0–24–3, పరాగ్ 2–0–17–0, చహల్ 4–0–48–1.
రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) అక్షర్ (బి) ఖలీల్ 4; బట్లర్ (బి) అక్షర్ 19; సామ్సన్ (సి) హోప్ (బి) ముకేశ్ 86; పరాగ్ (బి) రసిఖ్ 27; శుభమ్ (సి) స్టబ్స్ (బి) ఖలీల్ 25; పావెల్ (బి) ముకేశ్ 13; ఫెరీరా (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్ 1; అశి్వన్ (సి) హోప్ (బి) కుల్దీప్ 2; బౌల్ట్ (నాటౌట్) 2; అవేశ్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–4, 2–67, 3–103, 4–162, 5–180, 6–181, 7–185, 8–194. బౌలింగ్: ఖలీల్ 4–0–47–2, ఇషాంత్ 3–0–34–0, ముకేశ్ 3–0–30–2, అక్షర్ 3–0–25 –1, కుల్దీప్ 4–0–25–2, రసిఖ్ 3–0–36–1.
ఐపీఎల్‌లో నేడు
హైదరాబాద్ X లక్నో
వేదిక: హైదరాబాద్
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment