
వ్యవసాయ రంగంలో రైతులకు సాయం అందించేందుకు గాను ప్రముఖ డ్రోన్ల తయారీ సంస్థ గరుడ ఏరోస్పేస్ సరికొత్త కెమెరా డ్రోన్‌ను తయారు చేసింది. 'ద్రోణి' అని నామకరణం చేసిన ఈ డ్రోన్‌ను టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అధికారికంగా లాంచ్ చేశాడు. వ్యవసాయంలో మందుల పిచికారి కోసం బ్యాటరీ సాయంతో నడిచే ఈ డ్రోన్‌ను వినియోగించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ డ్రోన్ రోజుకు సుమారు 30 ఎకరాలలో నిరాటంకంగా మందుల పిచికారి చేస్తుందని వారు వివరించారు. ద్రోణి ఈ ఏడాది చివర్లో మార్కెట్‌లోకి వస్తుందని వారు వెల్లడించారు.
ద్రోణి ఆవిష్కరణ సందర్భంగా ధోని మాట్లాడుతూ.. కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో తాను కూడా వ్యవసాయం చేశానని గుర్తు చేశాడు. ద్రోణి వ్యవసాయ రంగంలో అద్భుతాలు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఈ సంస్థకు ధోని బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సంస్థలో ధోని పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. కాగా, చెన్నై ప్రధాన కార్యాలయంగా ఉన్న గరుడ ఏరోస్పేస్ సంస్థ వ్యవసాయ పురుగు మందుల స్ప్రేయింగ్‌తో పాటు సోలార్ ప్యానెల్ క్లీనింగ్, ఇండస్ట్రియల్ పైప్‌లైన్ తనిఖీలు, మ్యాపింగ్, సర్వేయింగ్, పబ్లిక్ అనౌన్స్‌మెంట్స్, డెలివరీ సర్వీసెస్ కోసం డ్రోన్ సొల్యూషన్‌లను అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment