నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. మూడో రోజుల్లో మ్యాచ్‌ను ముగించిన భారత్.. ఆస్ట్రేలియాను ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో చిత్తు చేసింది. 223 పరుగుల వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆస్ట్రేలియా కేవలం 91 పరుగులకే కుప్పకూలింది.
భారత స్పిన్నర్లు అశ్విన్ 5 వికెట్లు, జడేజా రెండు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించారు. అయితే ఆస్ట్రేలియా కేవలం ఒక సెషన్‌లోనే పతనమవుతుందని ఊహించలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.
పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్పెరెన్స్‌లో రోహిత్ మాట్లాడుతూ.. " ఆస్ట్రేలియా కేవలం కేవలం ఒక సెషన్‌లోనే కుప్పకూలుతుందని నేను అస్సలు ఊహించలేదు. మేము బౌలింగ్‌లో తీవ్రంగా కష్టపడాలని ముందే నిర్ణయించుకున్నాం. సెషన్ సెషన్‌కు ఆస్ట్రేలియాపై పట్టు సాధించాలని అనుకున్నాం. కానీ అదింతా ఒకే సెషన్‌లో జరుగుతుందని మేము అసలు అనుకోలేదు.
అయితే పిచ్‌పై ఎటువంటి బౌన్స్ లేకపోవడం నాకు కొంత ఆశ్చర్యం కలిగించించింది. ఏదేమైనప్పటికీ మా స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు. కాబట్టి క్రెడిట్ మొత్తం వాళ్లకే దక్కాలి" అని పేర్కొన్నాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు మ్యాచ్ ఢిల్లీ వేదికగా శుక్రవారం(ఫిబ్రవరి 17) నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: IND vs AUS: ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ రవీంద్ర జడేజాకు భారీ షాకిచ్చిన ఐసీసీ
Comments
Please login to add a commentAdd a comment