రోహిత్‌ శర్మ ఎట్టకేలకు సాధించాడు.. ఫ్యాన్స్‌ ఖుషీ | Fans Happy Rohit Sharma Hits Helicopter Shot As Like MS Dhoni Viral | Sakshi
Sakshi News home page

IPL 2022: రోహిత్‌ శర్మ ఎట్టకేలకు సాధించాడు.. ఫ్యాన్స్‌ ఖుషీ

Published Sun, Mar 20 2022 10:31 AM | Last Updated on Wed, Mar 23 2022 6:33 PM

Fans Happy Rohit Sharma Hits Helicopter Shot As Like MS Dhoni Viral - Sakshi

ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరు పొందిన ముంబై ఇండియన్స్‌ గతేడాది సీజన్‌లో మాత్రం నిరాశపరిచింది. ఐదుసార్లు ఐపీఎల్‌ చాంపియన్స్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌ ఈసారి సీజన్‌ను నూతనోత్సాహంతో ప్రారంభించాలని భావిస్తోంది. అందుకు తగ్గట్లే ఐపీఎల్‌ 15వ సీజన్‌ ముంబై, పూణే వేదికగా జరగనుండడం ముంబై ఇండియన్స్‌కు కలిసొచ్చే అంశం. ఏ జట్టుకు లేని సొంత గ్రౌండ్‌ అడ్వాంటేజిని రోహిత్‌ సేన ఉపయోగించుకోవాలని చూస్తోంది.

ఈ నేపథ్యంలో ముంబై జట్టు తమ ప్రాక్టీస్‌లో జోరు పెంచింది. ముఖ్యంగా హిట్‌మ్యాన్‌.. కెప్టెన్‌ రోహిత్‌ ప్రాక్టీస్‌లో సిక్సర్ల వర్షం కురిపించాడు. డే-1 ప్రాక్టీస్‌ పేరుతో ముంబై ఇండియన్స్‌ ప్రాంచైజీ.. రోహిత్‌ సహా మిగతా ఆటగాళ్ల ప్రాక్టీస్‌ను వీడియో రూపంలో షేర్‌ చేసింది. ఇందులో రోహిత్‌ ఆడిన కొన్ని బంతులు గ్రౌండ్‌ వెలుపల పడ్డాయి. ధోని ఫెవరెట్‌ షాట్‌ హెలికాప్టర్‌ సిక్స్‌ను ఎట్టకేలకు రోహిత్‌ కొట్టాడు. బంతి క్రీజులో పడగానే అచ్చం ధోనిని గుర్తుచేస్తూ లాంగాన్‌ మీదుగా హెలికాప్టర్‌ షాట్‌ ఆడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక ఐపీఎల్‌ 2020లో 332 పరుగులు చేసిన రోహిత్‌.. మరుసటి ఏడాది 2021 సీజన్‌లో 381 పరుగులు సాధించాడు. కాగా ఈసారి హిట్‌మ్యాన్‌ 500 ప్లస్‌ స్కోరు సాధిస్తాడని ముంబై ఇండియన్స్‌ ఫ్యాన్స్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ తొలి మ్యాచ్‌ను మార్చి 27న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది.

చదవండి: Robin Uthappa: ఐపీఎల్‌తో పోలికా.. పాక్ జర్నలిస్ట్‌కి కౌంటరిచ్చిన రాబిన్ ఊతప్ప

IPL 2022: 'కోహ్లి ఓపెనర్‌గా వద్దు.. ఆస్ధానంలోనే బ్యాటింగ్‌కు రావాలి'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement