సంజూ చీటింగ్‌ చేశాడా.. రోహిత్‌ శర్మకు అన్యాయం!? | Rohit Sharma Not-Out Sanju Fingers Touched Bails From-Behind-Viral | Sakshi
Sakshi News home page

#Rohit Notout: సంజూ చీటింగ్‌ చేశాడా.. రోహిత్‌ శర్మకు అన్యాయం!?

Published Sun, Apr 30 2023 11:12 PM | Last Updated on Sun, Apr 30 2023 11:14 PM

Rohit Sharma Not-Out Sanju Fingers Touched Bails From-Behind-Viral - Sakshi

Photo: IPL Twitter

ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఔట్‌ వివాదాస్పదంగా మారింది. ఆదివారం రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 పరుగులు చేసిన హిట్‌మ్యాన్‌ సందీప్‌ శర్మ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. అయితే వాస్తవానికి రోహిత్‌ శర్మ ఔట్‌ కాలేదని.. సంజూ శాంసన్‌ వేలు బెయిల్స్‌కు తగలడం.. అదే సమయంలో బంతి బెయిల్స్‌ను దాటి వెళ్లడం.. లైట్‌ వెలగడం ఒకేసారి జరిగిపోయాయి.

ఇదే విషయమై ట్విటర్‌లో ఒక అభిమాని రోహిత్‌ శర్మ ఔటైన తీరుని వీడియో రూపంలో షేర్‌ చేశాడు. ఆ వీడియోలో రోహిత్‌ ఔట్‌ కాలేదని స్పష్టంగా తెలుస్తోంది. బంతి ఎక్కడా బెయిల్స్‌కు తగిలినట్లు కనిపించలేదు. సంజూ చేతివేలి కారణంగానే బెయిల్స్‌ ఎగిరి లైట్‌ వచ్చిందని తెలుస్తోందని పేర్కొన్నాడు.

వీడియో చూసిన కొంతమంది అభిమానులు.. ''రోహిత్‌ శర్మకు అన్యాయం జరిగిందని.. ఫీల్డ్‌ అంపైర్‌ ఈ విషయాన్ని గుర్తించలేకపోయారని.. సూక్ష్మదృష్టితో చూస్తే రోహిత్‌ ఔట్‌ కాదని తెలుస్తుండడం కూడా ఒక కారణం. ఏది ఏమైనా హిట్‌మ్యాన్‌కు తీవ్ర అన్యాయం'' జరిగిందంటూ కామెంట్ల చేశారు. అసలే ఈ సీజన్‌లో బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమవుతూ విమర్శలు ఎదుర్కొంటున్న రోహిత్‌ ఈసారి దురదృష్టకర రీతిలో ఔటవ్వడం అభిమానులను బాధపెట్టింది. ప్రస్తుతం వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: సెంచరీతో కదం తొక్కిన జైశ్వాల్‌.. యంగెస్ట్‌ ప్లేయర్‌గా రికార్డు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement