ముర్షియా: మహిళల అంతర్జాతీయ టి20ల్లో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. నెదర్లాండ్స్‌కు చెందిన ఫ్రెడరిక్ ఒవర్డిక్...ఫ్రాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టింది. తద్వారా అంతర్జాతీయ టి20 ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా గుర్తింపు పొందింది.
పురుషుల విభాగంలోనూ ఇప్పటి వరకు ఎవరూ 7 వికెట్లు తీయలేదు. ప్రపంచకప్ యూరోప్ రీజియన్ క్వాలిఫయర్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఫ్రెడరిక్ దెబ్బకు ఫ్రాన్స్ 33 పరుగులకే కుప్పకూలింది. అనంతరం నెదర్లాండ్స్ 9 వికెట్లతో ఘన విజయాన్ని అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment