Former IPL KKR Player Rajagopal Sensational Allegations On Match Fixings He Get Offered - Sakshi
Sakshi News home page

కేకేఆర్‌ మాజీ ప్లేయర్‌ సంచలన ఆరోపణలు.. 40 లక్షలు ఇస్తా.. మ్యాచ్‌ ఫిక్స్‌ చేయమన్నారు! రంగంలోకి పోలీసులు

Published Wed, Jan 19 2022 11:50 AM | Last Updated on Wed, Jan 19 2022 5:03 PM

Former KKR Player Sensational Allegations Offered Rs 40 Lakhs To Fix Matches Report - Sakshi

PC: Chepauk Super Gullies

ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మాజీ ఆటగాడు, తమిళనాడు ప్లేయర్‌ రాజ్‌గోపాల్‌ సతీశ్‌ సంచలన ఆరోపణలు చేశాడు. మ్యాచ్‌ ఫిక్స్‌ చేయమని తనకు 40 లక్షల రూపాయలు ఆశ చూపారని ఆరోపించాడు.  ఈ మేరకు రాజగోపాల్‌ సతీశ్‌ బెంగళూరులో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా ఒకప్పుడు కేకేఆర్‌కు ప్రాతినిథ్యం వహించిన రాజగోపాల్‌ ప్రస్తుతం తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ ఆడుతున్నాడు. ఇందులో భాగంగా చెపాక్‌ సూపర్‌ గల్లీస్ తరఫున అతడు బరిలోకి దిగాడు. 

ఈ నేపథ్యంలో పోలీసులను ఆశ్రయించిన 40 ఏళ్ల రాజగోపాల్‌ బన్నీ ఆనంద్‌ అనే వ్యక్తి తనను మ్యాచ్‌ ఫిక్స్‌ చేయాలని కోరాడని ఫిర్యాదు చేశాడు. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ కథనం ప్రకారం... ‘‘జనవరి 3న బన్నీ ఆనంద్‌ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో నన్ను సంప్రదించాడు. 40 లక్షలు రూపాయలు ఆఫర్‌ చేశాడు. ఇప్పటికే ఇద్దరు ఆటగాళ్లు ఈ ఆఫర్‌కు అంగీకరించారని చెప్పాడు’’అని రాజగోపాల్‌ ఫిర్యాదులో పేర్కొన్నాడు.  ఈ విషయంపై స్పందించిన పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి అనుమానితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

చదవండి: Ind Vs Sa 1st ODI: ధావన్‌కు షాక్‌... ఓపెనర్‌గా వెంకటేశ్‌ అయ్యర్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement