జ‌డ్డూ చ‌ర్య‌పై గంభీర్ అస‌హ‌నం! | Gambhir Frustrated As Jadeja’s Costly No Ball Denies SL Captain’s Crucial Wicket In 1st Test At Galle, Watch Video Inside | Sakshi
Sakshi News home page

జ‌డ్డూ చ‌ర్య‌పై గంభీర్ అస‌హ‌నం!

Aug 19 2026 9:13 AM | Updated on Aug 19 2026 10:06 AM

Gambhir Frustrated-Jadeja No-Ball-Cost SL-Captain Wicket-1st-Test-Galle

Photo Credit: BCCI Twitter

గాలే వేదికగా లంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజ‌యానికి చేరువైంది. మ్యాచ్‌కు వ‌ర్షం ముప్పు పొంచి ఉన్న‌ప్ప‌టికీ, భార‌త్ విజ‌యానికి 6 వికెట్లు అవ‌స‌రం. 372 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన  లంక ప్ర‌స్తుతం 4 వికెట్లు కోల్పోయి 84 ప‌రుగులు చేసింది. కెప్టెన్ ధ‌నంజ‌య డి సిల్వా 31 ప‌రుగులు, సోనాల్ దినూష 25 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.  

ఐదోరోజు గాలేలో గంట‌ల త‌ర‌బ‌డి భారీ వ‌ర్షం ప‌డితే త‌ప్ప ఆట ర‌ద్దుకు ఆస్కారం లేక‌పోవ‌డంతో, లంక ఓట‌మి ఖాయంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే పిచ్ స్పిన్న‌ర్ల‌కు విప‌రీతంగా అనుకూలిస్తుండ‌డంతో స్పిన్ త్రయం జ‌డేజా, కుల్దీప్‌, మాన‌వ్ సుతార్‌లు వికెట్ల వేట‌లో ప‌డిపోయారు. ఇదిలా ఉంటే ర‌వీంద్ర జ‌డేజా చ‌ర్య ప‌ట్ల హెడ్‌కోచ్ గంభీర్ అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు. 

నాలుగో రోజు ఆటలో జడేజా బౌలింగ్‌లో లంక కెప్టెన్ ధ‌నంజ‌య డి సిల్వా ఔట‌య్యే ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌పడ్డాడు. ఇన్నింగ్స్ 16వ ఓవ‌ర్‌లో జ‌డేజా వేసిన చివ‌రి బంతి అద్భుతంగా ట‌ర్న్ తీసుకోవ‌డంతో ఏడు ప‌రుగులతో ఆడుతున్న ధ‌నంజ‌య ఫ‌స్ట్ స్లిప్‌లో సుల‌భ‌మైన క్యాచ్ ఇచ్చాడు. అయితే కీల‌క వికెట్ ప‌డింద‌న్న ఆనందం టీమిండియాకు ఎంతోసేపు నిల‌వలేదు. 

కొంపముంచిన నో బాల్‌
ఎందుకంటే జ‌డేజా బంతిని వేసేట‌ప్పుడు క్రీజు దాటి ముందుకు వెళ్ల‌డంతో అంపైర్ దానిని నో బాల్‌గా ప్ర‌క‌టించడంతో సంబ‌రాలు ఆగిపోయాయి. అలా ఔటయ్యే ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున్న ధ‌నంజ‌య 31 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. ఇదే స‌మయంలో డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న గంభీర్ ముఖ క‌వళిక‌ల్లో మార్పులు క‌నిపించాయి. కీల‌క వికెట్ ప‌డింద‌న్న సంతోషం క్ష‌ణ‌మైనా లేకుండా పోయిందే అన్న త‌ర‌హాలో గంభీర్ ఎక్స్‌ప్రెష‌న్ ఇచ్చాడు. 

ప‌నిలో ప‌నిగా వికెట్ ప‌డింద‌నుకున్న చోట‌ జ‌డేజా నో బాల్ కావ‌డంతో అత‌డిపై అస‌హ‌నం వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. గంభీర్ అస‌హ‌నం వ్య‌క్తం చేయ‌డం వెనుక బ‌ల‌మైన కార‌ణం ఉంద‌ని క్రీడా విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డ్డారు. ఒక్కోసారి ఇలాంటి త‌ప్పులే మ్యాచ్‌ను లాగేసుకునేందుకు ఆస్కార‌ముంటుంద‌న్నారు.

ఆ భయంతోనే..
ఏడు ప‌రుగుల వ‌ద్ద లైఫ్ ల‌భించిన ధ‌నంజ‌య రోజు ముగిసేరికి అజేయంగా నిలిచాడు. అత‌డికి అండ‌గా తొలి ఇన్నింగ్స్ సెంచ‌రీ హీరో దినూష కూడా ఉండ‌డంతో భార‌త్ విజ‌యంపై చిన్న అనుమానం నెల‌కొని ఉంది. ఒక‌వేళ ధ‌నంజ‌య భార‌త్ గెలుపుకు అడ్డుపుల్ల‌గా మారినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేద‌నిపిస్తోంది. 

అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడే దానిని ఉప‌యోగించుకోవాలి.. లేదంటే కోరి క‌ష్టాలు తెచ్చుకున్న‌ట్లే అవుతుందేమో. అందుకే గంభీర్ జ‌డేజా చ‌ర్య‌పై అస‌హ‌నం వ్య‌క్తం చేయ‌డం క‌నిపించింది. అయితే స్పిన్‌కు విప‌రీతంగా అనుకూలిస్తున్న గాలే పిచ్‌పై చివ‌రి రోజు బ్యాటింగ్ చేయ‌డం అసాధ్యం. మ‌రి ధ‌నంజ‌య‌, దినూష‌లు భార‌త్ విజ‌యానికి అడ్డుక‌ట్ట వేస్తారా లేక టీమిండియా స్పిన్న‌ర్ల ధాటికి వెనుదిరుగుతారా అన్న‌ది చూడాలి.

చదవండి: హాకీ ప్రపంచకప్‌: పాక్‌తో పోరు.. భారత్‌కు ‘డూ ఆర్ డై’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement