టీ20 ప్రపంచకప్-2024లో సత్తా చాటిన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్నాడు. లంకతో టీ20 సిరీస్‌లో రాణించేందుకు నెట్స్‌లో కఠినంగా శ్రమిస్తున్నాడు. కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్ మార్గదర్శనంలో భారత జట్టుతో కలిసి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంటున్నాడు.
అందుకే వేటు
కాగా హార్దిక్ పాండ్యా గత కొన్ని రోజులుగా తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచకప్ టోర్నీలో టీమిండియా వైస్ కెప్టెన్‌గా ఉన్న అతడు.. కెప్టెన్‌గా ప్రమోషన్ పొందుతాడని భావించగా.. బీసీసీఐ అనూహ్య నిర్ణయం తీసుకుంది. హార్దిక్‌ను కాదని టీ20 స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు పొట్టి ఫార్మాట్ సారథ్య బాధ్యతలు అప్పగించింది.
గాయాల సమస్యతో ఇబ్బంది పడే హార్దిక్ పాండ్యాపై తాము నమ్మకం ఉంచలేమని.. ఈ అరుదైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందంటూ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. కెప్టెన్‌గా సూర్య సరైన ఆప్షన్ అని పేర్కొన్నాడు.
విడాకులు తీసుకున్నా
ఇదిలా ఉంటే.. వ్యక్తిగత జీవితంలోనూ హార్దిక్ పాండ్యా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడు. ప్రేమించి పెళ్లాడిన భార్య నటాషా స్టాంకోవిక్‌తో విభేదాల నేపథ్యంలో.. పాండ్యా విడాకులు తీసుకున్నాడు. తన నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడిస్తూ.. నటాషాతో స్నేహం కొనసాగుతుందని తెలిపాడు.
అంతేకాదు.. కుమారుడు అగస్త్య విషయంలో తామిద్దరం తల్లిదండ్రులుగా బాధ్యతను నెరవేరుస్తామని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. ఇక విడాకుల అనంతరం నటాషా అగస్త్యను తీసుకుని సెర్బియాలోని తన పుట్టినింటికి వెళ్లిపోయింది.
సూపర్.. మీకు ఎవరి దిష్టి తగలకూడదు
ఈ క్రమంలో అగస్త్యతో కలిసి విహారయాత్రకు వెళ్లిన నటాషా ఆ ఫొటోలను ‘లవ్’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందుకు స్పందించిన హార్దిక్ పాండ్యా.. ‘‘సూపర్.. మీకు ఎవరి దిష్టి తగలకూడదు’’ అంటూ హార్ట్ సింబల్ ఎమోజీలను జతచేశాడు. ఇది చూసిన పాండ్యా అభిమానులు.. ‘‘వదిన, అగస్త్యను మర్చిలేకపోతున్నావా భయ్యా.. మళ్లీ కలిసిపోండి’’ అని కామెంట్లు చేస్తున్నారు.
కుమారుడి కోసమే
అయితే, మరికొందరు మాత్రం కుమారుడి కోసమే హార్దిక్ మాజీ భార్యతో సత్సంబంధాలు కోరుకుంటున్నాడని.. అందుకే ఇలా స్పందించాడని అభిప్రాయపడుతున్నారు. కాగా తాము కలిసి ఉన్న ఫొటోలను హార్దిక్, నటాషా ఇంతవరకు డిలీట్ చేయకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. హార్దిక్ పాండ్యా జూలై 27 నుంచి శ్రీలంకతో మొదలుకానున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో బిజీ బిజీగా గడుపనున్నాడు.
చదవండి: టీమిండియా మ్యాచ్‌లన్నీ లాహోర్‌లోనే!.. నో చెప్పిన ఐసీసీ!
Comments
Please login to add a commentAdd a comment