hardik pandya shake leg moments with son agastya became viral - Sakshi
Sakshi News home page

వైరల్‌: భార్య, కొడుకుతో దుమ్మురేపిన హార్దిక్‌

Published Sun, Mar 28 2021 12:20 PM | Last Updated on Sun, Mar 28 2021 12:50 PM

Hardik Pandya Shake Leg Moments With Son Agastya Became Viral - Sakshi

పుణే: టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా  తన కొడుకు అగస్త్యతో కలిసి డ్యాన్స్‌ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పాండ్యా భార్య నటాషా స్టాంకోవిక్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోనూ షేర్‌ చేసింది. విషయంలోకి వెళితే.. ఎడ్వర్డో లుజ్క్వినోస్ ఫేమస్‌ ఆల్బమ్‌ డోంట్‌ రష్‌ రిమిక్స్‌ పాటకు నటాషా లెగ్‌ మూమెంట్స్‌ చేయగా.. పాండ్యా తన కొడుకు అగస్త్యతో కలిసి నటాషా లెగ్‌ మూమెంట్స్‌ను అనుకరించాడు.
చదవండి: గావస్కర్‌ ‌.. ఫోన్‌ ఆన్‌లో ఉంది.. ఇప్పుడు మాట్లాడుదాం!


అంతకముందు నటాషా పాండ్యాతో కలిసి స్విమ్మింగ్‌పూల్‌లో దిగిన హాట్‌ ఫోటోలను కూడా షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు ట్రెండింగ్‌ లిస్టులో ఉన్నాయి. కాగా పాండ్యా ప్రస్తుతం ఇంగ్లండ్‌తో సిరీస్‌లో బిజీగా ఉన్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. దీంతో కీలకంగా మారిన ఆఖరి వన్డే మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. 
చదవండి: 'పాండ్యా విషయంలో ఆ లాజిక్‌ ఎలా మిస్సయ్యాడు'‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement