
17 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడడానికి వచ్చిన ఇంగ్లండ్ తొలి టెస్టులో రికార్డుల మోత మోగిస్తూనే ఉంది. టెస్టులో తొలిరోజే ఇంగ్లండ్ 500 పరుగులు చేసి కొత్త చరిత్ర సృష్టించింది. అంతేకాదు జట్టులో నలుగురు బ్యాటర్లు సెంచరీలు సాధించడం మరో విశేషం. ఇక తొలిరోజు ఆటలో ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు కొట్టిన హ్యారీ బ్రూక్ రెండో రోజు ఆటలోనూ ఒక రికార్డును అందుకున్నాడు.
అదేంటంటే పాక్ స్పిన్నర్ జహీద్ మసూద్ వేసిన ఒక ఓవర్లో 27 పరుగులు పిండుకున్నాడు. ఇంగ్లండ్ తరపున టెస్టు మ్యాచ్‌లో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు పిండుకున్న తొలి బ్యాటర్‌గా హ్యారీ బ్రూక్ నిలిచాడు. ఓవర్‌లో తొలి రెండు బంతులకు రెండు సిక్సర్లు బాదిన బ్రూక్.. తర్వాతి మూడు బంతులను బౌండరీలు తరలించాడు. ఇక చివరి బంతికి మూడు పరుగులు తీశాడు. ఇంతకముందున్న రికార్డు కూడా హ్యారీ బ్రూక్‌పైనే ఉంది. ఇదే మ్యాచ్‌లో తొలిరోజు ఆటలో షకీల్ బౌలింగ్‌లో ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు కొట్టిన బ్రూక్ 24 పరుగులు పిండుకున్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలిరోజు పాక్ బౌలర్లను చీల్చి చెండాడిన ఇంగ్లండ్ బ్యాటర్లు రెండోరోజు ఆటలో మాత్రం కాస్త తడబడ్డారు. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ భారీ స్కోర్ సాధించింది. 101 ఓవర్లలో ఇంగ్లండ్ 657 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జాక్ క్రాలీ(122), బెన్ డక్కట్ (107), ఓలీ పోప్(108), హ్యారీ బ్రూక్ (153) సెంచరీలతో చెలరేగారు. 506/4 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ మరో 151 పరుగులు చేసింది. పాకిస్తాన్ బౌలర్లలో స్పిన్నర్ జహీద్ ఆహ్మద్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. నషీం షా మూడు వికెట్లు, మహ్మద్ అలీ రెండు, హారీష్ రఫ్ ఒక్క వికెట్ సాధించారు.
Harry Brook smashed 27 in an over vs Zahid Mahmood 🔥🙌🏻#PAKvsEng #PakvsEng2022 #PAKvENG pic.twitter.com/lHt4pYMhdl
— Cricket.Social (@_cricketsocial) December 2, 2022
చదవండి: ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు.. తీసిపారేయొద్దు ఇదీ రికార్డే