హైదరాబాద్‌ రెండో విజయం అందుకుంటుందా! | Hyderabad Need 223 Runs 2nd Victory In Ranji Trophy 2022 | Sakshi
Sakshi News home page

Ranji Trophy 2022: హైదరాబాద్‌ రెండో విజయం అందుకుంటుందా!

Published Sun, Feb 27 2022 7:55 AM | Last Updated on Sun, Feb 27 2022 8:00 AM

Hyderabad Need 223 Runs 2nd Victory In Ranji Trophy 2022 - Sakshi

కటక్‌: రంజీ ట్రోఫీ క్రికెట్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ జట్టు వరుసగా రెండో విజయం సాధించేందుకు మరో 223 పరుగుల దూరంలో ఉంది. చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. బెంగాల్‌తో జరుగుతున్న ఎలైట్‌ గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌లో 239 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌... మూడో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 13.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 16 పరుగులు చేసింది.

కెప్టెన్‌ తన్మయ్‌ (0), అక్షత్‌ రెడ్డి (0) డకౌట్‌ కాగా, మికిల్‌ జైస్వాల్‌ (5) విఫలమయ్యాడు. తిలక్‌వర్మ (11 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 16/1తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన బెంగాల్‌ 205 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాద్‌ బౌలర్లలో తిలక్‌ వర్మ (3/13), తనయ్‌ త్యాగరాజన్‌ (3/44) బెంగాల్‌ ఇన్నింగ్స్‌ను దెబ్బతీశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement