వన్డేల్లో రెగ్యులర్ బౌలర్లు.. ఆల్‌రౌండర్లు.. పార్ట్‌టైమ్ బౌలర్లు ఉండడం సహజం. టీమిండియాలో సచిన్, సెహ్వాగ్ లాంటి వారు పార్ట్‌టైమ్ బౌలర్లుగా రాణించారు.. మ్యాచ్‌లు గెలిపించారు. కానీ ఏబీ డివిలియర్స్, మహేళ జయవర్దనే, స్టీఫెన్ ప్లెమింగ్, విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోని, సయీద్ అన్వర్,మహ్మద్ యూసఫ్ ఇలా ఎవరిని చూసుకున్నా వీరంతా ప్రొఫెషనల్ బ్యాట్స్‌మెన్లుగానే పేరు పొందారు. బ్యాట్స్‌మెన్లుగా ఒకప్పుడు సత్తా చాటినవారు కొందరు ఉంటే.. మరికొందరు ఇప్పుడు కూడా రాణిస్తూనే ఉన్నారు.
అయితే కెరీర్ మొత్తం బ్యాటింగ్‌కే పరిమితమైన ఈ ఆటగాళ్లు అరుదుగా బౌలింగ్ చేసేవారు. బ్యాట్స్‌మెన్లుగా తమ పేరిట ఎన్నో రికార్డులు సృష్టించిన వీళ్లు అప్పుడప్పుడు బౌలర్ అవతారమెత్తి వికెట్లు కూడా తీశారు. కొందరు మాత్రం మరో అడుగు ముందుకేసి మ్యాచ్‌లు గెలిపించడంలో కీలకపాత్ర పోషించారు. తాజాగా ఐసీసీ పాతతరం.. కొత్తతరం క్రికెటర్లు తమ జట్లకు బౌలింగ్ చేసిన ఒక మొమరబుల్ వీడియోనూ సోషల్ మీడియాలో షేర్ చేసింది. (చదవండి : స్వదేశంలో కలిసొచ్చింది.. మరి విదేశంలో)
ఈ వీడియోలో మనకు ఎప్పుడు బౌలింగ్ చేసినట్లు కనిపించని జయవర్దనే.. ఏబీ డివిలియర్స్.. ఎంఎస్ ధోని..స్టీఫెన్ ప్లెమింగ్ లాంటివారు బౌలింగ్ చేయడమే గాక వికెట్లు తీయడం చూపించారు. మీకు టైముంటే మాత్రం ఈ వీడియోను అస్సలు మిస్సవ్వద్దు అంటూ క్యాప్షన్ జతచేసింది. అయితే ఐసీసీ షేర్ చేసిన వీడియో కాస్త కొత్తగా ఉండడంతో వైరల్‌గా మారింది. (చదవండి : కూతురును చూసి మురిసిపోతున్న స్టార్ క్రికెటర్)
🤯 Virat Kohli, AB de Villiers, Mahela Jayawardene ... picking up international wickets!
— ICC (@ICC) December 16, 2020
Here's a video you don't want to miss 😄 pic.twitter.com/IkROsA3tew
Comments
Please login to add a commentAdd a comment