అదే జరిగితే హర్మన్‌ సేన ఇంటికే! | If-Rain Wash-out-Match-How India Qualify Semis-Womens T20 World Cup | Sakshi
Sakshi News home page

Womens T20 WC: అదే జరిగితే హర్మన్‌ సేన ఇంటికే!

Jun 27 2026 8:00 PM | Updated on Jun 27 2026 9:33 PM

If-Rain Wash-out-Match-How India Qualify Semis-Womens T20 World Cup

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆదివారంతో లీగ్ దశ మ్యాచ్‌లకు ఎండ్‌కార్డ్ పడనుంది. గ్రూప్‌-బి నుంచి ఇంగ్లండ్ జట్టు మాత్రమే ఇప్పటివరకు నాకౌట్ దశకు చేరుకోగా, మిగిలిన మూడు బెర్తులు ఏ జట్లు ఖరారు చేసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. గ్రూప్‌-బి నుంచి వెస్టిండీస్‌, న్యూజిలాండ్ మధ్య పోటీ నెలకొని ఉంది. ఈ రెండు జట్లలో ఎవరు సెమీస్‌లో అడుగుపెట్టనున్నారనేది ఇవాళ తేలిపోనుంది. 

మరోవైపు గ్రూప్‌-ఏలో ఆస్ట్రేలియా జట్టు అనధికారికంగా నాకౌట్‌కు చేరుకున్నప్పటికీ అధికారికంగా మాత్రం ఇంకా ఆ జట్టు సెమీస్ బెర్తును ఖరారు చేసుకోలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం డబుల్ హెడర్ పోరులో భాగంగా ఆస్ట్రేలియాతో భారత్‌, సౌతాఫ్రికాతో బంగ్లాదేశ్ తలపడనున్నాయి. 

ఇప్పటికే ఆస్ట్రేలియా 8 పాయింట్లతో తొలి స్థానంలో ఉంది. టీమిండియా, సౌతాఫ్రికాలు చెరో 6 పాయింట్లతో సంయుక్తంగా ఉన్నాయి. అయితే రన్‌రేట్ విషయంలో సౌతాఫ్రికాతో (0.734) పోలిస్తే భారత్ (2.268) మెరుగైన స్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో హర్మన్ సేన సెమీస్ బెర్తు ఖరారు చేసుకోవాలంటే ఆస్ట్రేలియాపై తప్పనిసరి గెలవాల్సిందే. భార‌త్ సెమీస్ చేరే క్ర‌మంలో స‌మీక‌ర‌ణాలు ఒక‌సారి పరిశీలిద్దాం.

ఆసీస్ చేతిలో ఓడిపోతే..
రేపు ఆస్ట్రేలియాతో జ‌రిగే మ్యాచ్‌లో హ‌ర్మ‌న్ సేన ఓడిపోతే మ‌న ఖాతాలో ఆరు పాయింట్లు ఉంటాయి. అప్పుడు బంగ్లాదేశ్‌, సౌతాఫ్రికా మ్యాచ్ ఫ‌లితం మ‌న‌కు కీల‌కంగా మార‌నుంది. బంగ్లాదేశ్ చేతిలో సౌతాఫ్రికా ఓడిపోవాల‌ని కోరుకోవాలి.  అప్పుడు ఆ జ‌ట్టు కూడా 6 పాయింట్లతోనే ఉంటుంది. ఇక్క‌డ నెట్‌ర‌న్‌రేట్ కీల‌కం కానుంది. ర‌న్‌రేట్ విష‌యంలో సౌతాఫ్రికా కంటే మ‌నం మెరుగ్గా ఉండ‌డంతో ఆసీస్‌తో క‌లిసి సెమీస్‌లో అడుగుపెడ‌తాం. ఒక‌వేళ బంగ్లాపై సౌతాఫ్రికా గెలిస్తే మాత్రం టీమిండియా ఇంటిబాట ప‌ట్ట‌నుంది.

👉ఒక‌వేళ ఆస్ట్రేలియాతో టీమిండియా గెలిచి, బంగ్లాపై సౌతాఫ్రికా గెలిచినా మెరుగైన ర‌న్‌రేట్ కార‌ణంగా హ‌ర్మ‌న్ సేన సెమీస్‌లో అడుగుపెట్ట‌నుంది. సౌతాఫ్రికా ఓడితే ఎలాంటి స‌మీక‌ర‌ణాల‌తో సంబంధం లేకుండా భార‌త్ నేరుగా సెమీస్‌లో అడుగుపెట్ట‌నుంది.

వ‌ర్షం ప‌డి ర‌ద్ద‌యితే..
ఒక‌వేళ ఆస్ట్రేలియా, టీమిండియా మ్యాచ్ వ‌ర్షంతో  ర‌ద్ద‌యితే, అప్పుడు కూడా టీమిండియాకు అవ‌కాశం ఉంటుంది. వ‌ర్షంతో మ్యాచ్ ర‌ద్ద‌యితే హ‌ర్మ‌న్ సేన ఖాతాలో 7 పాయింట్లు ఉంటాయి. అదే స‌మ‌యంలో బంగ్లాదేశ్ చేతిలో సౌతాఫ్రికా ఓడిపోవాల్సి ఉంటుంది. 

అప్పుడు భార‌త్ ఏడు పాయింట్ల‌తో నేరుగా సెమీస్‌లో అడుగుపెట్ట‌నుంది. ఒక‌వేళ సౌతాఫ్రికా గెలిస్తే మాత్రం స‌మీక‌ర‌ణాల‌తో సంబంధం లేకుండా ఆసీస్‌తో పాటు స‌ఫారీలు నాకౌట్‌లో అడుగుపెట్ట‌నుంది.

చదవండి: అరువు తెచ్చుకున్న పోల్‌తో జాతీయ రికార్డు!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement