బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో విజయం సాధించిన టీమిండియా.. ఇప్పుడు ఢిల్లీ వేదికగా జరగనున్న రెండో టెస్టుకు సన్నద్దం అవుతుంది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు శుక్రవారం ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో నాగ్‌పూర్ నుంచి రోహిత్ సారథ్యంలోని భారత జట్టు ఢిల్లీకు మంగళవారం పయనం అయింది.
ఇక నాగ్‌పూర్ టెస్టు మ్యాజిక్‌నే రెండో టెస్టులోను పునరావృతం చేయాలని భారత్ భావిస్తుంటే.. ఆస్ట్రేలియా మాత్రం ఎలాగైనా విజయం సాధించి సిరీస్ సమం చేయాలని వ్యూహాలు రచిస్తోంది. ఇక తొలి టెస్టుకు గాయం కారణంగా దూరమైన టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.. ఇప్పుడు రెండో రెండో టెస్టుకు కూడా అందుబాటులో లేడు. ఈ క్రమంలో అయ్యర్ స్థానంలో సూర్యను ఆడించాలా లేదా గిల్‌కు అవకాశం ఇవ్వాలా అన్న చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.
కాగా తొలి టెస్టులో అయ్యర్ స్దానంలో జట్టులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ తీవ్రంగా నిరాశపరిచాడు. కేవలం 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. అయితే ఢిల్లీ టెస్టుకు మాత్రం సూర్యను పక్కనపెట్టి గిల్‌ను తీసుకురావాలని జట్టు మెనేజెమెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా గిల్‌ను ఓపెనర్‌గా అవకాశం ఇచ్చి.. కేఎల్ రాహుల్‌ను మిడిలార్డర్‌లో బ్యాటింగ్ పంపాలని రోహిత్, ద్రవిడ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.
ఇక తొలి టెస్టులో విఫలమైన వికెట్ కీపర్ బ్యాటర్ కెఎస్ భరత్‌ను రెండో టెస్టుకు కూడా కొనసాగించే అవకాశం ఉంది. మరోవైపు స్పిన్నర్ కుల్దీపస్ యాదవ్ మరోసారి బెంచ్‌కే పరిమితమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం జట్టులో అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ రూపంలో ముగ్గురు స్పిన్నర్లు ఉన్నారు. వీరు ముగ్గురు కూడా తొలి టెస్టులో అద్భుతంగా రాణించారు.
చదవండి: Ian Chappell: అలా చేయకపోయుంటే కోహ్లి హవాలో రోహిత్ తెరమరుగయ్యేవాడు..!
Comments
Please login to add a commentAdd a comment