India vs Australia, 2nd Test- Virat Kohli: బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో రెండో టెస్టుకు సిద్ధమైంది టీమిండియా. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 17న మ్యాచ్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే భారత్- ఆసీస్ ఆటగాళ్లు సన్నాహకాలు మొదలుపెట్టారు.
నాగ్‌పూర్‌లో జరిగిన తొలి టెస్టులో గెలుపొందిన టీమిండియా ఢిల్లీ మ్యాచ్‌లోనూ గెలుపొందాలని పట్టుదలగా ఉండగా.. సిరీస్ సమం చేసి సత్తా చాటాలని కంగారూ జట్టు ఉవ్విళ్లూరుతోంది. ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్ టాప్ ఫైనలిస్టుగా ఉండేందుకు ఇరు జట్లు తీవ్రంగా పోటీపడుతున్నాయి.
నోస్టాల్జిక్ ఫీలింగ్
ఈ నేపథ్యంలో రెండో టెస్టు మరింత రసవత్తరంగా మారనుంది. ఇదిలా ఉంటే.. ఢిల్లీ మ్యాచ్‌కు సన్నద్ధమవుతున్న టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఇన్‌స్టాలో షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. స్వస్థలానికి చేరుకున్న కోహ్లి.. ‘‘చాలా ఏళ్ల తర్వాత ఢిల్లీలో స్టేడియానికి ఇలా లాంగ్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం.. ఈ అనుభూతి చాలా చాలా బాగుంది’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. నోస్టాల్జిక్ ఫీలింగ్ అంటూ గత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నాడు.
లోకల్ బాయ్
1988లో ఢిల్లీలో జన్మించిన కోహ్లికి చిన్ననాటి నుంచే క్రికెట్ అంటే ప్రాణం. దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటి 2008లో అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో భారత కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఐసీసీ ట్రోఫీ గెలిచిన అతడు స్వల్ప కాలంలోనే టీమిండియా స్టార్‌గా ఎదిగాడు. మహేంద్ర సింగ్ ధోని ప్రోత్సాహంతో జట్టులో కీలక సభ్యుడిగా మారి.. ధోని వారసుడిగా ఎదిగి కెప్టెన్సీ చేపట్టాడు.
అయితే, టీ20 ప్రపంచకప్-2021 తర్వాత టీ20 కెప్టెన్సీ వదిలేసిన కోహ్లి.. తర్వాత వన్డే, టెస్టు సారథ్య బాధ్యతలకు దూరమయ్యాడు. ఫామ్‌లేమితో ఇబ్బంది పడి విమర్శల పాలయ్యాడు. అయితే, ఆసియా కప్-2022 టీ20 టోర్నీ ద్వారా కెరీర్‌లో 71వ అంతర్జాతీయ సెంచరీ చేసి మునుపటి కోహ్లిని గుర్తు చేశాడు.
సొంత మైదానంలో
తర్వాత వరుస సెంచరీలు బాది రన్‌మెషీన్ అన్న పేరుకు న్యాయం చేశాడు. ఇక ఇప్పుడు ఆసీస్‌తో కీలక టెస్టుకు సిద్ధమవుతున్న వేళ ఢిల్లీలో గడిపిన గత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు కోహ్లి. కాగా తొలి టెస్టులో 12 పరుగులు మాత్రమే చేసి అతడు అవుటయ్యాడు. దీంతో సొంత మైదానంలోనైనా కింగ్ బ్యాట్ ఝులిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
చదవండి: Virat Kohli: రోహిత్‌పై ప్రేమ లేదు.. కానీ కోహ్లికి వ్యతిరేకం! బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ కామెంట్స్ వైరల్
Ind Vs Aus 2nd Test: ఆసీస్‌తో రెండో టెస్టు ప్రత్యేకం.. ప్రధాని మోదీని కలిసిన పుజారా
Comments
Please login to add a commentAdd a comment