నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత్.. ఇప్పుడు రెండో టెస్టులో కూడా అదే ఫలితం పునరావృతం చేయాలని ఊవ్విళ్లరూతోంది. మరోవైపు ఆస్ట్రేలియా తొలి టెస్టు ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలి అని భావిస్తోంది.
ఇక భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు శుక్రవారం నుంచి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగనుంది. ఇక ఇప్పటికే ఢిల్లీలో అడుగుపెట్టిన ఇరు జట్లు తమ ప్రాక్టీస్‌లో మునిగి తేలుతున్నాయి. ఈ నేపథ్యంలో అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్ రిపోర్ట్, గత రికార్డులు ఎలా ఉన్నాయో ఓ సారి పరిశీలిద్దాం.
గత రికార్డులు ఏం చెబుతున్నాయంటే?
టెస్టు క్రికెట్‌లో అరుణ్‌జైట్లీ స్టేడియం భారత జట్టుకు కంచుకోట వంటింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ వేదికలో 1987 నుంచి ఒక్క టెస్టు మ్యాచ్‌లో కూడా టీమిండియా ఓటమి చెందలేదు. దాదాపు 36 ఏళ్ల నుంచి ప్రత్యర్ధి జట్లపై భారత్ పూర్తి అధిపత్యం చెలాయిస్తూ వస్తోంది. గత 36 ఏళ్లలో కేవలం రెండు టెస్టులు మాత్రమే డ్రా ముగిశాయి. ఇదే వేదికపై ఇంగ్లండ్, శ్రీలంక, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ వంటి మేటి జట్లను భారత్ చిత్తు చేసింది. చివరగా 1987లో వెస్టిండీస్ జట్టు ఈ వేదికలో ఓడించింది.
ఇక ఈ వేదికలో ఇప్పటివరకు 36 టెస్టు మ్యాచ్‌లు జరగ్గా.. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 6 సందర్భాల్లో విజయం సాధించగా, సెకెండ్ బ్యాటింగ్ జట్టు 13 సార్లు గెలిపొందింది. మిగితా 17 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఇక ఓవరాల్‌గా భారత్ 34 టెస్టులు ఆడగా.. అందులో 13 మ్యాచ్‌లు గెలుపొందింది. 6 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఇక ఢిల్లీ గడ్డపై ఆసీస్ రికార్డును పరిశీలిస్తే.. ఇప్పటివరకు ఇక్కడ మొత్తం 7 మ్యాచ్‌లు ఆడగా.. అందులో ఒక మాత్రమే గెలిచారు. ఇక ఈ వేదికలో 644/8 అత్యధిక స్కోర్‌గా ఉండగా.. 75/10 అతి తక్కువ స్కోర్‌గా ఉంది.
పిచ్ రిపోర్ట్
అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్ కూడా ఇతర మైదానాల మాదిరిగానే తొలుత బ్యాటింగ్‌కు అద్భుతంగా ఉంటుంది. అయితే పిచ్ పాతబడే కొద్ది నెమ్మదిగా స్పిన్‌కు అనుకూలిస్తుంది. అయితే ఇక్కడ ట్రాక్ నల్లమట్టితో తయారైనందున బంతి పెద్దగా బౌన్స్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ కూడా స్పిన్నర్లను ఎదుర్కొవడం బ్యాటర్లకు సవాలుగా మారే అవకాశం ఉంది.
మరోసారి ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు కనిపించే ఛాన్స్ ఉంది. కాగా ఇదే పిచ్‌పై భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్ల ఘనత సాధించి చరిత్ర సృష్టించాడు. టాస్ గెలిచిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, శ్రీకర్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్
చదవండి: IND vs AUS: 150 కి.మీ వేగంతో సూపర్ డెలివరీ.. దెబ్బకు కెప్టెన్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment