మళ్లీ మళ్లీ చూస్తాడు.. మా ఆయనకు అదొక పిచ్చి! | IND Vs ENG Suryakumar Yadav Enjoying His Maiden Fifty Attracts Netizens | Sakshi
Sakshi News home page

సూర్యకుమార్‌లో ఈ యాంగిల్‌ కూడా ఉందా వదినమ్మా?!

Published Sat, Mar 20 2021 7:24 PM | Last Updated on Mon, Mar 22 2021 8:05 PM

IND Vs ENG Suryakumar Yadav Enjoying His Maiden Fifty Attracts Netizens - Sakshi

అహ్మదాబాద్‌: టీమిండియా ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌, అతడి భార్య దేవిషా శెట్టి మధ్య జరిగిన సరదా సంభాషణకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. ఇందులో.. అంతర్జాతీయ స్థాయిలో ఆడిన తొలి మ్యాచ్‌లో తన మెరుపు ఇన్నింగ్స్‌ చూసుకుని మురిసిపోతున్న సూర్యను దేవిష ఆటపట్టిస్తోంది. ‘‘ఏం చేస్తున్నావు. మళ్లీ మ్యాచ్‌ చూస్తున్నావా’’ అని భర్తను ఆమె అడగగా.. ‘‘బౌండరీలు, సిక్సర్లు చూసుకుంటున్నా’’ అంటూ చిరునవ్వులు చిందిస్తూ అతడు సమాధానమిచ్చాడు.

ఇందుకు బదులుగా.. ‘‘నిజంగా ఈ అబ్బాయి చాలా క్రేజీ. మ్యాచ్‌ పూర్తైన ప్రతిసారీ.. టీవీలో గానీ, ఫోన్‌లో గానీ.. ఇదిగో ఇలా మళ్లీ మళ్లీ తన ఇన్నింగ్స్‌ చూసుకుంటూనే ఉంటాడు. మ్యాడ్‌’’ అని దేవిష కామెంట్‌ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. 

ఈ క్రమంలో.. ‘‘తనదైన రోజున సూర్య భయ్యా చెలరేగి ఆడతాడని మాకు తెలుసు. కానీ ఆయనలో ఉన్న ఈ కోణం గురించి మీరే మాకు తెలియజేశారు వదినమ్మా. చిన్నపిల్లాడిలా సంబరపడిపోతున్న సూర్యను చూస్తుంటే ముచ్చటేస్తుంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20 ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన సూర్యకుమార్‌కు ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు.

ఇక మూడో టీ20లో అతడిని పక్కన పెట్టగా, నాలుగో టీ20లో వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. సిక్సర్‌తో పరుగుల ఖాతా తెరిచి,  6 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో  28 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసి సత్తా చాటాడు. ఇక సూర్య సూపర్‌ ఇన్నింగ్స్‌తో టీమిండియా నాలుగో టీ20లో విజయం సాధించిన విషయం తెలిసిందే. నేడు అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతున్న నిర్ణయాత్మక ఆఖరి మ్యాచ్‌లోనూ సూర్యకుమార్‌కు చోటుదక్కింది.

చదవండి: అదొక చెత్త నిర్ణయం: ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌
 సిక్సర్‌తో మొదలుపెట్టి.. 28 బంతుల్లోనే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement