మిల్లర్‌ సెంచరీ వృధా.. దక్షిణాఫ్రికాపై భారత్‌ విజయం | IND vs SA 2nd T20 Guwahati: Updates And Highlights | Sakshi
Sakshi News home page

IND vs SA 2nd T20: మిల్లర్‌ సెంచరీ వృథా.. దక్షిణాఫ్రికాపై భారత్‌ విజయం

Published Sun, Oct 2 2022 6:39 PM | Last Updated on Sun, Oct 2 2022 11:16 PM

IND vs SA 2nd T20 Guwahati: Updates And Highlights - Sakshi

గౌహతి వేదికగా దక్షిణాఫ్రికాతో రెండో టీ20లో 16 పరుగుల తేడాతో టీమిండియా  విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలూండగానే.. 2-0 తేడాతో భారత్‌ కైవసం చేసుకుంది. ఇక 238 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది.

ప్రోటీస్‌ బ్యాటర్‌ డేవిడ్‌ మిల్లర్‌ అద్భుతమైన సెంచరీ సాధించినప్పటికి.. జట్టును గెలిపించలేక పోయాడు. ప్రోటీస్‌ బ్యాటర్లలో మిల్లర్‌(47 బంతుల్లో 106), డికాక్‌(69) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌ రెండు వికెట్లు, అక్షర్‌ పటేల్‌ ఒక్క వికెట్‌ సాధించారు.

అంతకుముందు టీమిండియా బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి టీమిండియా 237 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. భారత బ్యాటర్లలో కేఎల్‌ రాహుల్‌(28 బంతుల్లో 57), సూర్యకుమార్‌ యాదవ్‌(22 బంతుల్లో 61) అర్ధసెంచరీలతో చెలరేగారు. అదే విధంగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(43), విరాట్‌ కోహ్లి(49), కార్తీక్‌( 7 బంతుల్లో 17) కూడా కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. ప్రోటీస్‌ బౌలర్లలో కేశవ్‌ మహారాజ్‌కే రెండు వికెట్లు దక్కాయి

18 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్‌: 175/3
18 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. క్రీజులో డికాక్‌(49), మిల్లర్‌(51) పరుగులతో ఉన్నారు.

15 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్‌: 143/3
15 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. క్రీజులో డికాక్‌(49), మిల్లర్‌(51) పరుగులతో ఉన్నారు.

10 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్‌: 70/3
10 ఓవర్లకు దక్షిణాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది. క్రీజులో డికాక్‌(21), మిల్లర్‌(10) పరుగులతో ఉన్నారు.

6 ఓవర్లకు ప్రోటీస్‌ స్కోర్‌: 45/2
6 ఓవర్లు ముగిసే సరికి ప్రోటీస్‌ 2 వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసింది. క్రీజులో మారక్రమ్‌(31), డికాక్‌(9) పరుగులతో ఉన్నారు.

 రెండు వికెట్లు కోల్పోయిన ప్రోటీస్‌
239 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా కేవలం ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయింది. ప్రోటీస్‌ ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ వేసిన ఆర్ష్‌దీప్‌ సింగ్‌ బౌలింగ్‌లో టెంబా బావుమా, రుసో డకౌట్‌గా వెనుదిరిగారు.

భారత బ్యాటర్ల విధ్వంసం.. దక్షిణాఫ్రికా టార్గెట్‌ 238 పరుగులు
దక్షిణాఫ్రికాతో రెండో టీ20లో టీమిండియా బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి టీమిండియా 237 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. భారత బ్యాటర్లలో కేఎల్‌ రాహుల్‌(28 బంతుల్లో 57), సూర్యకుమార్‌ యాదవ్‌(22 బంతుల్లో 61) అర్ధసెంచరీలతో చెలరేగారు. అదే విధంగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(43), విరాట్‌ కోహ్లి(49), కార్తీక్‌( 7 బంతుల్లో 17) కూడా కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. ప్రోటీస్‌ బౌలర్లలో కేశవ్‌ మహారాజ్‌కే రెండు వికెట్లు దక్కాయి

మూడో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
209 పరుగులు వద్ద టీమిండియా మూడు వికెట్‌ కోల్పోయింది. 61 పరుగులు చేసిన సూర్యకుమార్‌ యాదవ్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు. 18 ఓవర్లకు భారత్‌ స్కోర్‌ 209/2

17 ఓవర్లకు టీమిండియా స్కోర్‌: 194/2
సూర్యకుమార్‌ యాదవ్‌ విధ్వంసం సృష్టించాడు. కేవలం 18 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటి వరకు 5 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. 17 ఓవర్లకు టీమిండియా స్కోర్‌: 194/2

15 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 155/2
15 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్‌ యాదవ్‌(35), విరాట్‌ కోహ్లి(12) పరుగులతో క్రీజులో ఉన్నారు.

రెండో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
107 పరుగులు వద్ద కేఎల్‌ రాహుల్‌ (57) వికెట్‌ను టీమిండియా కోల్పోయింది. కేశవ్‌ మహారాజ్‌ బౌలింగ్‌లో రాహుల్‌ ఔటయ్యాడు. 13 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 125/2. క్రీజులో విరాట్‌ కోహ్లి,  సూర్యకుమార్‌ యాదవ్‌ ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన టీమిండియా
96 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. 43 పరుగులు చేసిన రోహిత్‌ శర్మ.. కేశవ్‌ మహారాజ్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి విరాట్‌ కోహ్లి వచ్చాడు.

దూకుడుగా ఆడుతున్న టీమిండియా.. 
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా దూకుడుగా ఆడుతోంది. 8 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 73 పరుగులు చేసింది.  క్రీజులో రోహిత్‌ శర్మ(21), కేఎల్‌ రాహుల్‌(25) పరుగులతో ఉన్నారు.

5 ఓవర్లకు టీమిండియా స్కోర్‌: 49/0
5 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్‌ నష్టపోకుండా 49 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్‌ శర్మ(21), కేఎల్‌ రాహుల్‌(25) పరుగులతో ఉన్నారు.

2 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 15/0
2 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్‌ నష్టపోకుండా 15 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్‌ శర్మ(4), కేఎల్‌ రాహుల్‌(9) పరుగులతో ఉన్నారు.

గౌహతి వేదికగా దక్షిణాఫ్రికాతో రెండో టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది.  ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన తొలుత దక్షిణాఫ్రికా తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది.  కాగా ఈ మ్యాచ్‌లో ప్రోటీస్‌ జట్టు ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగనుండగా.. టీమిండియా మాత్రం జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు.

తుది జట్లు:
దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్ (వికెట్‌ కీపర్‌), టెంబా బావుమా (కెప్టెన్‌), రిలీ రోసోవ్, ఐడెన్ మార్క్‌రామ్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నార్ట్జే, లుంగి ఎన్‌గిడి

టీమిండియా
: కేఎల్‌ రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్‌), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్‌ కీపర్‌), దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, అర్ష్‌దీప్‌ సింగ్

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement