IND Vs SA T20 Series 2022: Team India Starts Training For The Upcoming SA T20 Series, BCCI Shares Video - Sakshi
Sakshi News home page

Ind Vs SA T20I Series: ప్రొటిస్‌తో టీ20 సిరీస్‌.. ప్రాక్టీసులో తలమునకలైన టీమిండియా

Published Tue, Jun 7 2022 11:03 AM | Last Updated on Tue, Jun 7 2022 11:41 AM

Ind Vs SA T20 Series 2022: India Preparation Starts BCCI Shares Pics Video - Sakshi

India Vs South Africa 2022 T20 Series: స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ టీమిండియా సన్నద్ధమవుతోంది. ప్రొటిస్‌ను ఎదుర్కొనే క్రమంలో ఆటగాళ్లు నెట్స్‌లో చెమటోడుస్తున్నారు. ఢిల్లీ వేదికగా తొలి టీ20 జరుగనున్న అరుణ్‌ జైట్లీ స్టేడియంలో ప్రాక్టీసు మొదలుపెట్టారు. ఇక ఈ సిరీస్‌తో భారత జట్టులో తొలిసారిగా చోటు దక్కించుకున్న ఉమ్రాన్‌ మాలిక్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ వంటి యువ ఆటగాళ్లు సీనియర్ల సలహాలు, సూచనలు తీసుకుంటూ మెలకువలు నేర్చుకుంటున్నారు.

అదే విధంగా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఆటగాళ్లను ఉద్దేశించి దిశానిర్దేశం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను బీసీసీఐ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఇక దక్షిణాఫ్రికాతో సిరీస్‌తో చాన్నాళ్ల తర్వాత దినేశ్‌ కార్తిక్‌, హార్దిక్‌ పాండ్యా రీ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే.

కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడే నిమిత్తం ప్రొటిస్‌ జట్టు ఇప్పటికే భారత్‌కు చేరుకుంది. జూన్‌ 9 నుంచి ఆరంభం కానున్న సిరీస్‌కై తెంబా బవుమా బృందం ప్రాక్టీసు మొదలుపెట్టేసింది. ఇక రోహిత్‌ శర్మ గైర్హాజరీలో కేఎల్‌ రాహుల్‌ భారత జట్టుకు సారథ్యం వహించనున్న విషయం తెలిసిందే. 

చదవండి: అందుకే నేను వికెట్‌ కీపర్‌ అయ్యాను: రిషబ్ పంత్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement