West Indies 13 Member Squad For 1st Test against India: టీమిండియాతో టెస్టు సిరీస్ నేపథ్యంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. జూలై 12న మొదలుకానున్న తొలి టెస్టు కోసం 13 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసినట్లు తెలిపింది. క్రెగ్ బ్రాత్‌వైట్ కెప్టెన్‌గా కొనసాగనుండగా.. ఇద్దరు లెఫ్టాండ్ బ్యాటర్లు తొలిసారి విండీస్ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నారు.
ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అదరగొట్టి
ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో రాణించిన అలిక్ అథనాజ్, కిర్క్ మెకంజీ ఈ మేరకు రోహిత్ సేనతో మ్యాచ్ నేపథ్యంలో సెలక్టర్ల పిలుపు అందుకున్నారు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 30 మ్యాచ్‌లు ఆడిన అథనాజ్ 1825 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. ఇక మెకంజీ తొమ్మిది మ్యాచ్‌లు ఆడి 591 పరుగులు(ఒక సెంచరీ కూడా ఉంది) సాధించాడు.
రెండేళ్ల తర్వాత రీఎంట్రీ!
ఇక వీరిద్దరు ఇటీవల బంగ్లాదేశ్- ఏ జట్టుతో జరిగిన మూడు మ్యాచ్‌ల అనధికారిక సిరీస్‌లో వరుసగా 220, 209 పరుగులు సాధించారు. ఇదిలా ఉంటే.. ఆల్‌రౌండర్ రకీం కార్న్‌వాల్ 2021 తర్వాత తొలిసారి తిరిగి జట్టులోకి వచ్చాడు. కాగా రకీం 2019లో టీమిండియాతో టెస్టు సిరీస్‌తోనే అరంగేట్రం చేయడం విశేషం.
మరోవైపు.. లెఫ్టార్మ్ స్పిన్నర్ గుడకేశ్ మోటీ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అదే విధంగా జైడెన్ సీల్స్, కైలీ మేయర్స్ కూడా గాయాల కారణంగా సెలక్షన్‌కు అందుబాటులో లేకుండా పోయారు. కాగా జూలై 12- జూలై 16 వరకు వెస్టిండీస్- టీమిండియా మధ్య డొమినికాలో తొలి టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే.
టీమిండియాతో తొలి టెస్టుకు వెస్టిండీస్ జట్టు:
క్రెగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (వైస్ కెప్టెన్), అలిక్ అథనాజ్, తగ్‌నరన్ చందర్‌పాల్, రకీం కార్న్‌వాల్, జాషువా డా సిల్వా, షానన్ గాబ్రియేల్, జేసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్, కిర్క్ మెకంజీ, రేమన్ రీఫర్, కీమర్ రోచ్, జోమెల్ వారికాన్.
ట్రావెలింగ్ రిజర్వ్స్: టెవిన్ ఇమ్లాచ్, అకీమ్ జోర్డాన్.
వెస్టిండీస్‌తో రెండు టెస్టులకు బీసీసీఐ ప్రకటించిన జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ.
చదవండి: SL Vs WI: విండీస్‌కు మరో పరాభవం.. ఇంతకంటే గొప్పగా ఏం చేయగలరు?!
Comments
Please login to add a commentAdd a comment