India tour of West Indies, 2023: దాదాపు నెలరోజుల విరామం తర్వాత టీమిండియా మైదానంలో దిగనుంది. వెస్టిండీస్‌తో వరుస సిరీస్‌లు ఆడేందుకు సిద్ధమైంది. కరేబియన్ గడ్డపై టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లతో కావాల్సినంత వినోదం పంచనుంది. కాగా ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2023 ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే.
ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ అనంతరం భారత టెస్టు జట్టుకు సుదీర్ఘ విరామం లభించింది. సుమారు 20 రోజుల పాటు ఆటగాళ్లు సెలవులను ఎంజాయ్ చేశారు. అనంతరం దాదాపు నెల రోజుల పర్యటన కోసం విండీస్ గడ్డపై అడుగుపెట్టారు.
జూలై 12న మొదలయ్యే తొలి టెస్టుతో మళ్లీ బిజీ కానున్నారు. ఇక ఆగష్టు 13న టీమిండియా.. వెస్టిండీస్ పర్యటన ముగియనుంది. మరి ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, జట్లు, మ్యాచ్ ఆరంభ సమయం(భారత కాలమానం ప్రకారం), లైవ్ స్ట్రీమింగ్ తదితర వివరాలు చూద్దామా?!
టెస్టు సిరీస్
►తొలి టెస్టు: జూలై 12- జూలై 16, విండ్సర్ పార్క్, రోసో, డొమినికా
►రెండో టెస్టు: జూలై 20- జూలై 24, క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్, ట్రినిడాడ్
►మ్యాచ్ ఆరంభ సమయం: రాత్రి 7. 30 నిమిషాలకు
వన్డే సిరీస్
►తొలి వన్డే: జూలై 27(గురువారం)- కెన్నింగ్‌స్టన్ ఓవల్, బ్రిడ్జ్‌టౌన్, బార్బడోస్
►రెండో వన్డే: జూలై 29(శనివారం)- కెన్నింగ్‌స్టన్ ఓవల్, బ్రిడ్జ్‌టౌన్, బార్బడోస్
►మూడో వన్డే: ఆగష్టు 1(మంగళవారం)- బ్రియన్ లారా స్టేడియం, టరౌబా, ట్రినిడాడ్
►రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ఆరంభం
టీ20 సిరీస్
►తొలి టీ20: ఆగష్టు 3(గురువారం)- బ్రియన్ లారా స్టేడియం, టరౌబా, ట్రినిడాడ్
►రెండో టీ20: ఆగష్టు 6(ఆదివారం)- ప్రొవిడెన్స్ స్టేడియం, గయానా
►మూడో టీ20: ఆగష్టు 8(మంగళవారం)- ప్రొవిడెన్స్ స్టేడియం, గయానా
►నాలుగో టీ20: ఆగష్టు 12(శనివారం)- సెంట్రల్ బ్రౌవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్, లాడర్‌హిల్, ఫ్లోరిడా
►ఐదో టీ20: ఆగష్టు 13(ఆదివారం)- సెంట్రల్ బ్రౌవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్, లాడర్‌హిల్, ఫ్లోరిడా
►మ్యాచ్‌లు రాత్రి ఎనిమిది గంటలకు ఆరంభం
వెస్టిండీస్‌తో మూడు ఫార్మాట్ల సిరీస్‌లకు భారత జట్లు:
టెస్టు జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ.
వన్డే జట్టు వివరాలు:
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, సంజూ సామ్సన్, ఇషాన్ కిషన్, శార్దుల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, చహల్, కుల్దీప్, జైదేవ్ ఉనాద్కట్, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముకేశ్.
టీ20 జట్టు:
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.
టీమిండియాతో తొలి టెస్టుకు వెస్టిండీస్ జట్టు:
క్రెగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (వైస్ కెప్టెన్), అలిక్ అథనాజ్, తగ్‌నరన్ చందర్‌పాల్, రకీం కార్న్‌వాల్, జాషువా డా సిల్వా, షానన్ గాబ్రియేల్, జేసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్, కిర్క్ మెకంజీ, రేమన్ రీఫర్, కీమర్ రోచ్, జోమెల్ వారికాన్.
ట్రావెలింగ్ రిజర్వ్స్: టెవిన్ ఇమ్లాచ్, అకీమ్ జోర్డాన్.
ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే?
వెస్టిండీస్- ఇండియా మ్యాచ్‌లు దూర్‌దర్శన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అదే విధంగా జియో సినిమా ఫ్యాన్ కోడ్ యాప్‌లో కూడా మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment