వెస్టిండీస్ పర్యటనకు టీమిండియా (రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి: ఫైల్ ఫొటో)
India tour of West Indies, 2023: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ తర్వాత లభించిన సుదీర్ఘ విశ్రాంతి తర్వాత టీమిండియా ఆటగాళ్లు వెస్టిండీస్ పర్యటనకు సిద్ధం కానున్నారు. జూలై 12- ఆగష్టు 13 వరకు దాదాపు నెలరోజుల పాటు విండీస్ టూర్‌తో బిజీగా గడుపనున్నారు. ఈ పర్యటనలో భారత జట్టు ఆతిథ్య వెస్టిండీస్‌తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది.
అయితే, ఇంతవరకు విండీస్‌తో తలపడనున్న భారత జట్టును బీసీసీఐ ప్రకటించలేదు. ఈ క్రమంలో జూన్ 27న బోర్డు ఇందుకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. కాగా కెప్టెన్ రోహిత్ శర్మ సహా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కేవలం విండీస్‌తో కేవలం టెస్టు సిరీస్ వరకే అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది.
వాళ్లిద్దరి అరంగేట్రం ఫిక్స్
టెస్టు మ్యాచ్‌లు ముగిసిన తర్వాత వీరిద్దరు భారత్‌కు తిరిగిరానున్నట్లు సమాచారం. ఇక స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ సైతం కొన్ని మ్యాచ్‌లకే పరిమితం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. సంజూ శాంసన్, యశస్వి జైశ్వాల్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్ తదితరులకు వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.
పాండ్యాకే పగ్గాలు
ఇక ఈ సిరీస్‌తో యశస్వి టీమిండియా తరఫున, అర్ష్‌దీప్ టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. టెస్టులు ముగిసిన తర్వాత రోహిత్ గైర్హాజరీ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా పరిమిత ఓవర్ల సిరీస్‌లకు సారథిగా వ్యవహరించనున్నట్లు బీసీసీఐ వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి.
క్వాలిఫయింగ్ టోర్నీలో విండీస్
కాగా విండీస్- టీమిండియా మధ్య జూలై 12- 24 వరకు రెండు టెస్టులు, జూలై 27- ఆగష్టు 1 వరకు మూడు వన్డేలు, ఆగష్టు 3- 13 వరకు ఐదు టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇదిలా ఉంటే.. జూన్ 18 నుంచి జరుగనున్న వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫైయింగ్ టోర్నీతో ప్రస్తుతం వెస్టిండీస్ బిజీగా ఉంది.
ప్రపంచకప్ ఈవెంట్‌కు అర్హత సాధించే క్రమంలో రెండు బెర్త్‌ల కోసం వెస్టిండీస్‌తో పాటు శ్రీలంక, జింబాబ్వే, ఐర్లాండ్, నేపాల్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్, అమెరికా, ఒమన్, యూఏఈ బరిలో ఉన్నాయి.
చదవండి: వరల్డ్‌కప్ క్వాలిఫియర్ మ్యాచ్‌లకు సర్వం సిద్దం.. ఫోటోలకు ఫోజులిచ్చిన కెప్టెన్లు
Comments
Please login to add a commentAdd a comment