
Breadcrumb
Ind Vs Wi 3rd ODI: టీమిండియా ఘన విజయం.. సిరీస్ క్లీన్‌స్వీప్
Published Fri, Feb 11 2022 1:04 PM | Last Updated on Fri, Feb 11 2022 8:48 PM

Live Updates
ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మూడో వన్డే అప్డేట్స్
మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం.. సిరీస్ క్లీన్‌స్వీప్
వెస్టిండీస్‌తో మూడో వన్డేలో టీమిండియా 96 పరుగులతో ఘన విజయం సాధించింది. 266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 37.1 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ విజయంతో టీమిండియా 3-0తో వెస్టిండీస్‌ను వైట్‌వాష్ చేసింది. వెస్టిండీస్ బ్యాటింగ్‌లో ఓడియన్ స్మిత్ 36 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. కెప్టెన్ నికోలస్ పూరన్ 34, అల్జారీ జోసెఫ్ 29 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ , సిరాజ్, ప్రసిధ్ కృష్ణ తలా మూడు వికెట్లు తీయగా.. కుల్దీప్, దీపక్ చహర్ చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. శ్రేయాస్ అయ్యర్ 80 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. రిషబ్ పంత్ 56 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక చివర్లో దీపక్ చహర్ 38, వాషింగ్టన్ సుందర్ 33 పరుగులు చేయడంతో టీమిండియా 250 ప్లస్ స్కోరు దాటింది. విండీస్ బౌలర్లలో జాసన్ హోల్డర్ 4, అల్జారీ జోసెఫ్, హెడెన్ వాల్ష్ చెరో రెండు వికెట్లు, ఓడియన్ స్మిత్, ఫాబియెన్ అలెన్ తలా ఒక వికెట తీశారు. 42 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో అయ్యర్, పంత్‌లు 110 పరుగులు భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు.
విజయానికి ఒక వికెట్ దూరంలో
టీమిండియా విజయానికి కేవలం ఒక వికెట్ దూరంలో ఉంది.13 పరుగులు చేసిన వాల్ష్ సిరాజ్ బౌలింగ్‌లో రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం వెస్టిండీస్ 36 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. అల్జారీ జోసెఫ్ 29, కీమర్ రోచ్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు వాల్ష్(13)తో కలిసి జోసెఫ్ 47 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడం విశేషం.
విజయానికి రెండు వికెట్ల దూరంలో
టీమిండియా విజయానికి కేవలం రెండు వికెట్ల దూరంలో ఉంది. ప్రస్తుతం వెస్టిండీస్ 26 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. అల్జారీ జోసెఫ్ 10, వాల్ష్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు అల్జారీ జోసెఫ్ 18 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో కాసేపు మెరుపులు మెరిపించాడు.
ఓటమి దిశగా వెస్టిండీస్.. ఏడో వికెట్ డౌన్
మూడో వన్డేలోనే వెస్టిండీస్ ఓటమి దిశగా పయనిస్తోంది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో 34 పరుగులు చేసిన పూరన్ రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగడంతో విండీస్ ఏడో వికెట్ కోల్పోయింది. అంతకముందు పరుగుల ఖాతా తెరవకుండానే ఫాబియెన్ అలెన్‌ను కుల్దీప్ పెవిలియన్ చేర్చాడు. దీంతో వెస్టిండీస్ ఆరో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 18 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. విండీస్ విజయానికి 185 పరుగులు అవసరం కాగా.. క్లీన్‌స్వీప్‌కు టీమిండియా 4 వికెట్ల దూరంలో ఉంది.
డారెన్ బ్రావో(20) ఔట్.. నాలుగో వికెట్ కోల్పోయిన వెస్టిండీస్
లక్ష్యచేధనలో వెస్టిండీస్ తడబడుతుంది. 20 పరుగులు చేసిన డారెన్ బ్రావో ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం వెస్టిండీస్ 14 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ 28, హోల్డర్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.
దీపక్ చహర్ దెబ్బ.. బ్రూక్స్ డకౌట్.. వెస్టిండీస్ మూడో వికెట్ డౌన్
దీపక్ చహర్ దెబ్బకు వెస్టిండీస్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. తొలుత 14 పరుగులు చేసిన బ్రాండన్ కింగ్‌ను పెవిలియన్ చేర్చిన దీపక్ చహర్.. ఓవర్ ఆఖరి బంతికి బ్రూక్స్‌ను డకౌట్ చేశాడు. ప్రస్తుతం విండీస్ 6 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 30 పరుగులతో ఆడుతోంది.
తొలి వికెట్ కోల్పోయిన వెస్టిండీస్
266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ తొలి వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో షెయ్ హోప్(5) ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం వెస్టిండీస్ 4 ఓవర్లలో వెస్టిండీస్ వికెట్ నష్టానికి 24 పరుగులు చేసింది. బ్రాండన్ కింగ్ 14, డారెన్ బ్రావో 5 పరుగులతో ఆడుతున్నారు.
టీమిండియా 265 ఆలౌట్.. విండీస్ టార్గెట్ 266

వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా 50 ఓవర్లలో 265 పరుగులుకు ఆలౌట్ అయింది. శ్రేయాస్ అయ్యర్ 80 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. రిషబ్ పంత్ 56 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక చివర్లో దీపక్ చహర్ 38, వాషింగ్టన్ సుందర్ 33 పరుగులు చేయడంతో టీమిండియా 250 ప్లస్ స్కోరు దాటింది. విండీస్ బౌలర్లలో జాసన్ హోల్డర్ 4, అల్జారీ జోసెఫ్, హెడెన్ వాల్ష్ చెరో రెండు వికెట్లు, ఓడియన్ స్మిత్, ఫాబియెన్ అలెన్ తలా ఒక వికెట తీశారు. 42 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో అయ్యర్, పంత్‌లు 110 పరుగులు భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు.
ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా..
సూపర్‌గా ఆడుతున్న దీపక్ చహర్(38) ఔట్ కావడంతో టీమిండియా 240 పరుగుల వద్ద ఏడో వికెట్ నష్టపోయింది. వాషింగ్టన్ సుందర్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నమోదు చేసిన చహర్ హోల్డర్ బౌలింగ్‌లో హోప్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
టీమిండియా ప్రస్తుత స్కోరు: 221/6 (43.4)
దీపక్ చహర్ 23, వాషింగ్టన్ సుందర్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు.
పాపం అయ్యర్.. సెంచరీ మిస్
సీనియర్లు విఫలమైన వేళ బ్యాట్ ఝులిపించి జట్టును ఆదుకున్న శ్రేయస్ అయ్యర్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. హెడెన్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో 80 పరుగులకే క్రీజును వీడాల్సి వచ్చింది. ఇక అయ్యర్ పెవిలియన్ చేరడంతో టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది.
ఐదో వికెట్ డౌన్
సూర్యకుమార్ యాదవ్ రూపంలో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతడు నిష్క్రమించాడు.
నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా.. పంత్(56) ఔట్
రిషబ్ పంత్(56) రూపంలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. టీమిండియా మూడు వికెట్లు కోల్పోయిన అనంతరం శ్రేయాస్ అయ్యర్, పంత్‌లు కలిసి ఇన్నింగ్స్ నిర్మించారు. ఇద్దరి మధ్య వందకు పైగా పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది. ఈ దశలో పంత్ హాఫ్ సెంచరీ చేసిన కాసేపటికే హెడెన్ వాల్ష్ బౌలింగ్‌లో కీపర్ హోప్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 30 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది.
పంత్ సూపర్ హాఫ్ సెంచరీ
రిషభ్ పంత్ కూడా అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. 47 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. సీనియర్లు విఫలమైన వేళ శ్రేయస్ అయ్యర్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను నెత్తికెత్తుకున్నాడు.
శ్రేయస్ అయ్యర్ అర్ధ సెంచరీ
విండీస్‌తో మ్యాచ్‌లో టీమిండియా యువ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ అర్ధ శతకం బాదాడు. తద్వారా వన్డే కెరీర్లో తొమ్మిదో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
అర్ధ సెంచరీ దిశగా అయ్యర్, పంత్
విండీస్‌తో మూడో వన్డేలో శ్రేయస్ అయ్యర్ నిలకడగా ఆడుతున్నాడు. 65 బంతులు ఎదుర్కొన్న అతడు 42 పరుగులు చేసి అర్ధ సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు. ఇక రిషభ్ పంత్ అద్భుత స్ట్రైక్ రేటుతో మెరుపులు మెరిపిస్తున్నాడు. 43 బంతుల్లో 43 పరుగులు చేశాడు. 25 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 119-3.
ఆచితూచి ఆడుతున్న అయ్యర్, పంత్
మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్ ఇన్నింగ్స్ నెమ్మదిగా సాగుతోంది. శ్రేయస్ అయ్యర్(21), రిషభ్ పంత్(10) ఆచితూచి ఆడుతున్నారు. వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలిస్తున్నారు. ప్రస్తుత స్కోరు: 65/3 (15.3).
మూడో వికెట్ కోల్పోయిన భారత్
టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. స్మిత్ బౌలింగ్‌లో శిఖర్ ధావన్ అవుట్ అయ్యాడు. హోల్డర్‌కు క్యాచ్ ఇచ్చి 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. రిషభ్ పంత్ క్రీజులోకి వచ్చాడు.
టీమిండియా ప్రస్తుత స్కోరు: 41/2 (9 ఓవర్లు)
టీమిండియా ప్రస్తుత స్కోరు: 41/2 (9 ఓవర్లు)
9 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 41 పరుగులు.
ధావన్ 10, శ్రేయస్ అయ్యర్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.
కోహ్లి మరోసారి విఫలం.. డకౌట్.. రెండో వికెట్ డౌన్
మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి మరోసారి విఫలమయ్యాడు. రోహిత్ వికెట్ తీసి జోరు మీదున్న జోసెఫ్ చేతికి చిక్కాడు. అతడి బౌలింగ్‌లో షై హోప్‌నకు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. శ్రేయస్ అయ్యర్, ధావన్ క్రీజులో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా
టీమిండియా బిగ్ వికెట్ కోల్పోయింది. జోసెఫ్ బౌలింగ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ బౌల్డ్ అయ్యాడు. టీమిండియా ప్రస్తుత స్కోరు: 16/1 (3.4).
రివ్యూకు వెళ్లిన విండీస్.. చేదు అనుభవం
రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. బౌలింగ్ అటాక్ ఆరంభించిన రోచ్... మూడో బంతికే రోహిత్ శర్మ ఎల్బీడబ్ల్యూ అయ్యాడని అప్పీలు చేశాడు. రివ్యూకు వెళ్లగా అక్కడ చేదు అనుభవమే ఎదురైంది. రోహిత్ సేవ్ అయ్యాడు. తొలి ఓవర్ ముగిసే సరికి భారత్ ఐదు పరుగులు చేసింది.
ధావన్ వచ్చేశాడు.. కుల్దీప్ కూడా!
మూడో వన్డేలో భాగంగా టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ తుది జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. శ్రేయస్ అయ్యర్, కుల్దీప్ యాదవ్ కూడా జట్టుతో చేరారు. ఇక విండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ మూడో వన్డేకు కూడా దూరమయ్యాడు. అతడి స్థానంలో పూరన్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, సూర్యకుమార్, వాషింగ్టన్ సుందర్, దీపక్ చహర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ
వెస్టిండీస్: నికోలస్ పూరన్ (కెప్టెన్), షై హోప్, బ్రండన్ కింగ్, డారెన్ బ్రేవో, బ్రూక్స్, హోల్డర్, ఫ్యాబియన్ అలెన్, ఒడియన్ స్మిత్, జోసెఫ్, హైడెన్, కేమార్ రోచ్.
💬 💬 "I've shifted my focus from competition to contribution."
— BCCI (@BCCI) February 11, 2022
Ahead of the third @Paytm #INDvWI ODI, #TeamIndia's @SDhawan25 - during his pre-match interview - shares his approach towards the game. pic.twitter.com/xlj7Vc1K6q
టాస్ గెలిచిన టీమిండియా
టీమిండియా- వెస్టిండీస్ మధ్య అహ్మదాబాద్ వేదికగా మూడో వన్డే జరుగనుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. విండీస్‌ను ఫీల్డింగ్‌కు ఆహ్వానించాడు.
Huddle Talk ✅
— BCCI (@BCCI) February 11, 2022
We are moving closer to the LIVE action from Ahmedabad. 👍 👍#TeamIndia | #INDvWI | @Paytm pic.twitter.com/YnQJuVuf2O
Related News By Category
Related News By Tags
-
పంత్ ప్రవర్తనపై రోహిత్ శర్మ ఆగ్రహం.. వీడియో వైరల్
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహానికి గురయ్యాడు. వెస్టిండీస్‌తో నాలుగో టి20లో బ్యాటింగ్‌లో 44 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌తో మెరిసిన పంత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు...
-
మ్యాచ్ గెలవాలని.. ముందస్తు ప్లాన్ అయితే కాదుగా!
టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ట్రోల్ చేయడంలో ఎప్పుడు ముందుంటాడు. అవకాశం దొరికిన ప్రతీసారి జాఫర్ ఏదో ఒక ఫన్నీ ట్వీట్‌తో అలరిస్తాడు. తాజాగా భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో టి20పై జాఫర్...
-
రెండో టీ20కి ముందు రోహిత్‌ను ఊరిస్తున్న ప్రపంచ రికార్డు
వెస్టిండీస్‌తో రెండో టీ20కి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఓ ప్రపంచ రికార్డు ఊరిస్తుంది. సెయింట్ కిట్స్ వేదికగా ఇవాళ (ఆగస్ట్ 1) రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో రోహిత్ మరో 57 పరుగ...
-
టీమిండియా ఆధిపత్యం కొనసాగేనా..? రెండో టీ20లో విండీస్‌తో 'ఢీ'కి రెడీ అయిన రోహిత్ సేన
తొలి టీ20లో విండీస్‌పై 68 పరుగుల భారీ తేడా గెలుపొంది జోరుమీదున్న టీమిండియా.. నేడు జరిగే రెండో టీ20లోనూ గెలిచి మరో క్లీన్‌స్వీప్‌కు బాటలు వేయాలని పట్టుదలతో ఉంది. గెలిచిన జట్టును మార్చేందుకు సుముఖంగా ల...
-
Ind Vs WI 1st T20: అద్భుతంగా ముగించాం! చాలా హర్ట్ అయ్యాం! అయినా ఇది ఆరంభమే!
India Vs West Indies 1st T20- Rohit Sharma Comments: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. ట్రినిడాడ్ వేదికగా శుక్రవారం జరిగిన మొదటి మ్యాచ్‌లో రోహిత్ సేన 68 పరుగులతో ఘన విజయం సాధ...
Comments
Please login to add a commentAdd a comment