Ind Vs Wi ODI Series: వెస్టిండీస్‌తో వన్డే పోరుకు సన్నద్ధమవుతున్న భారత జట్టు గురువారం మొదటి సారి మైదానంలోకి దిగింది. ట్రైనర్లతో కలిసి ఆటగాళ్లు స్వల్ప సమయం పాటు సాధన చేసినట్లు జట్టు వర్గాలు వెల్లడించాయి. ‘‘శుభవార్త... భారత శిబిరంలో కొత్తగా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. రోహిత్, దీపక్.. కొంతమంది ఇతర ఆటగాళ్లు ప్రాక్టీసు మొదలుపెట్టారు. కోవిడ్ పాజిటివ్‌గా తేలిన వారు ఏడురోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండనున్నారు.
మయాంక్ శనివారం జట్టుతో చేరతాడు’’ అని బీసీసీఐ అధికారి జాతీయ మీడియాతో వ్యాఖ్యానించారు. కాగా జట్టు సభ్యులు ధావన్, రుతురాజ్, శ్రేయస్ అయ్యర్, నవదీప్ సైనీ ఇప్పటికే కరోనా బారిన పడ్డారు. ప్రత్యామ్నాయ ఆటగాడిగా బీసీసీఐ మయాంక్ అగర్వాల్‌ను జట్టులోకి ఎంపిక చేసింది. నిబంధనల ప్రకారం అతనూ గురువారం నుంచి శనివారం వరకు మూడు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నాడు. అతడికి బ్యాకప్ ఓపెనర్‌గా టి20 స్పెషలిస్ట్ ఇషాన్ కిషన్‌ను బీసీసీఐ వన్డే జట్టులోకి తీసుకుంది.
చదవండి: Yash Dhull: యశ్ ధుల్ ఎలా కొట్టావయ్యా ఆ సిక్స్.. క్రికెట్ పుస్తకాల్లో పేరుందా!
Indian players in practice session today 💪 #INDvWI pic.twitter.com/D3BDmFQhLw
— Himalayan Guy (@RealHimalayaGuy) February 3, 2022
Comments
Please login to add a commentAdd a comment